కంచరపాలెంలో తాగుబోతుల హల్‌చల్‌

2 Aug, 2018 12:42 IST|Sakshi
పోలీసులకు దొరికిన మందుబాబు రవి,కానిస్టేబుల్‌పై దాడి చేస్తున్న తాగుబోతు గణేష్‌

కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న మందుబాబు

దొరికిన ఒక వ్యక్తి... మరొకరు పరార్‌

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): మద్యం సేవించి మత్తు తలకెక్కిన కొందరు బర్మా క్యాంపు సమీపంలోని దివ్య వైన్‌ షాపు వద్ద తీవ్ర రాద్ధాంతం చేశారు. చుట్టు పక్కల వారిని భయబ్రాంతులకు గురి చేశారు. ఈ సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లిన పోలీస్‌ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా బుధవారం సంచలనం రేపింది. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధి బర్మా క్యాంప్‌ వద్ద రవి, గణేష్‌ అనే యువకులు బుధవారం సాయంత్రం తాగిన మైకంలో హల్‌చల్‌ చేశారు. దీంతో ఇక్కడ గొడవ జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు రక్షక్‌ వాహనంలో వెళ్తే... వారిపై కూడా గణేస్‌ దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారైపోయాడు. రవిని పట్టుకోగా శరీరంపై కొన్ని దెబ్బలు ఉండడంతో చికిత్స అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దాడికి పాల్పడిన గణేష్‌ కోసం గాలిస్తున్నారు. రవి బర్మా క్యాంప్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, గణేష్‌ కప్పరాడకు చెందినవాడని గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు