అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

22 Dec, 2019 20:26 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విలే పార్లే కాలనీలోని ఓ  అపార్టమెంట్‌లో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 13 అంతస్థుల భవనంలోని 7,8 ఫ్లోర్‌లో భారీగా అగ్నికిలలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో 10 ఫైర్‌ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగలేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు