అనుమానాస్పద స్థితిలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ మృతి

30 Jul, 2019 09:26 IST|Sakshi
ప్రేమ్‌సాగర్‌ మృతదేహం

చనిపోయాడా? చంపేశారా?  

అనుమానాస్పద స్థితిలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ మృతి  

మద్యం మత్తులో గోడలు, పైపుల ఆధారంగా ఇద్దరు యువకులు ఓ అపార్ట్‌మెంట్‌ పైకి ఎక్కేందుకు ప్రయత్నించగా... వారిలో ఒకరు చనిపోగా,మరొకరు గాయపడ్డారు. మరణించిన వ్యక్తి ఓ సంస్థలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ కాగా..  క్షతగాత్రుడు బైక్‌ చోరీ కేసుల్లో నిందితుడు. అయితే మూడో అంతస్తు నుంచి పడడంతోనే యువకుడుమరణించినట్లు పోలీసులు పేర్కొంటుండగా... అతడి స్నేహితులే పథకం ప్రకారం హత్య చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. బంజారాహిల్స్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   

హైదరాబాద్‌: మద్యం మత్తులో ఓ అపార్ట్‌మెంట్‌ పైకి ఎక్కడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకుల్లో కిందపడి ఒకరు చనిపోగా, మరొకరు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా, కొత్తకోట మండలం వడ్డవెట్ట గ్రామానికి చెందిన వేముల ప్రేమ్‌సాగర్‌ (20) ఇంటర్‌ చదివాడు. తండ్రి  హరిబాబు, తల్లి లక్ష్మీలతో కలిసి ఫిల్మ్‌నగర్‌లోని దుర్గాభవానీనగర్‌లో ఉంటూ ఓ సంస్థలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు.  బోనాల పండుగ సందర్భంగా ఆదివారం రాత్రి అతను తన స్నేహితులైన  సత్యానంద్, గణేష్, నాగరాజుతో కలిసి హైటెక్‌ సిటీ వైపు వెళ్లి అక్కడ మద్యం తాగారు. అనంతరం వీరు అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌ వైపు వచ్చారు. గణేష్, నాగరాజు తమ ఇళ్లకు వెళ్లిపోగా,  ప్రేమ్‌సాగర్, సత్యానంద్‌ ఫిలింనగర్‌ వైపు వెళ్లారు. అక్కడి వెంచర్‌–2లో ఉన్న ట్రెండ్‌ సెట్‌ విల్లా అపార్ట్‌మెంట్‌ వద్ద ఆగిన వీరు గోడలు, పైపులు పట్టుకుని భవనం పైకి ఎక్కేందుకు ప్రయత్నం చేశారు. మూడో అంతస్తు వరకు వెళ్ళిన తర్వాత అదుపుతప్పి ఇద్దరూ కింద పడిపోయారు. తీవ్ర గాయాలతో సెల్లార్‌లో పడిన వీరిని గమనించిన అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ రోడ్డు పైకి తీసుకువచ్చి వదిలేశాడు. సోమవారం ఉదయం వీరిని గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రేమ్‌సాగర్‌ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన సత్యానంద్‌ చికిత్స పొందుతున్నాడు.

మత్తులో నుంచి బయట పడిన అతను కొన్ని వివరాలు వెల్లడించాడు. ఆదివారం రాత్రి వీరితో కలిసి ఉన్న గణేష్, నాగరాజులనూ పోలీసులు విచారించగా అందరు కలిసి మద్యం తాగింది వాస్తమే అయినా సత్యానంద్, ప్రేమ్‌సాగర్‌లను వదిలి తాము ఇళ్ళకు వెళ్ళిపోయినట్లు తెలిపారు. కాగా మృతుడి తల, మెడపై తీవ్ర గాయాలు ఉండటం, సమీపంలోనే వీరి బైక్‌ ధ్వంసమై ఉండటంతో బైక్‌ స్కిడ్‌ కావడంతో కిందపడి ఇద్దరూ గాయపడి ఉంటారని, తీవ్రగాయాలు కావడంతో ప్రేమ్‌ మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రేమ్‌సాగర్‌ తల్లిదండ్రులు తమ కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సత్యానంద్‌ తదితరులు పథకం ప్రకారం ప్రేమ్‌సాగర్‌ను చంపి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సదరు అపార్ట్‌మెంట్‌ సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌ను పరిశీలించగా, వీరు ఇద్దరూ అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తు నుంచి కింద పడినట్లు నిర్థారించారు. ఈ విజువల్స్‌నే ప్రేమ్‌సాగర్‌ కుటుంబీకులకు చూపించారు. అయితే వీరిద్దరూ అసలు అపార్ట్‌మెంట్‌ పైకి అక్రమంగా ఎక్కడానికి ఎందుకు ప్రయత్నించారనే దానిపై ఆరా తీస్తున్నారు. సత్యానంద్‌పై చోరీ కేసులు ఉండటంతో అతడే ప్రేమ్‌సాగర్‌ను ఉసిగొల్పి చోరీ కోసం తీసుకువెళ్తున్నాడా? లేక మరోదైనా కారణం ఉందా? అనే అంశాలు ఆరా తీస్తున్నారు. వీరిని బయటికి తీసుకువచ్చి వదిలేసిన వాచ్‌మెన్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గోరింటాడ యువకుడు లాత్వియాలో మృతి

న్యూజిలాండ్‌ పంపిస్తామని చెప్పి లక్షలు దోచుకున్నారు

వైద్యవిద్యార్థి ఆత్మహత్య!

రూంకి రమ్మనందుకు యువతి ఆత్మహత్యాయత్నం

ఏ తల్లి నిను కన్నదో..

మృతదేహాన్ని ముసిరిన ఈగలు, చీమలు

గ్రౌండ్‌మన్‌ను చంపేశారు..!

మౌనపోరాటంతో అనుకున్నది సాధించింది

ఆస్తి దక్కలేదని వివాహిత ఆత్మహత్య

బాలుడి హత్య.. నరబలిగా అనుమానం

తల్లి కోసం హత్యలు..!

సోనీ ఆచూకి లభ్యం

కోటిస్తేనే కనికరించారు!

ఉరిశిక్ష అమలులో జాప్యం, సంచలన తీర్పు

డమ్మీ గన్‌తో పోలీసులనే బెదిరించి..!

‘ఉన్నావ్‌’ కేసులో ట్విస్ట్‌; బీజేపీ ఎమ్మెల్యేపై కేసు

ఫిలింనగర్‌లో దారుణం..

హయత్‌నగర్ కిడ్నాప్ కేసులో వీడని మిస్టరీ!

కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నాం :డీసీపీ

వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి!

వేకువనే విషాదం

వానతో పాటు వస్తాడు... ఊడ్చుకుపోతాడు

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య

వ్యభిచారం గుట్టురట్టు

కాగజ్‌నగర్‌లో 144 సెక్షన్‌ 

ఉన్నావ్‌ ప్రమాదానికి కారణం అదే..

ఆంధ్రా సరిహద్దులో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరి మృతి

క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేక...

జీతానికి.. దొంగలు?

పోలీస్‌ దొంగయ్యాడు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌