నీట్‌ రాయడానికి లోదుస్తులు విప్పించారు

11 May, 2018 03:35 IST|Sakshi

పాలక్కడ్‌: వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌కు హాజరైనప్పుడు లోనికి అనుమతించే ముందు తన లోదుస్తులు విప్పించారని కేరళ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 6న కొప్పాలోని లయన్స్‌ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. బాధితురాలితో పాటు మరికొందరు లోదుస్తుల్లో కూడా లోహపు భాగాలున్నాయంటూ వాటిని విప్పించటం వివాదాస్పదమైంది. పరీక్ష రాస్తున్నప్పుడు ఇన్విజిలేటర్‌ వ్యవహరించిన తీరు కూడా తీవ్ర ఇబ్బందికి గురిచేసిందని ఆమె ఆరోపించింది. ‘ఇన్విజిలేటర్‌ చాలాసార్లు ఆమె ముందు నిలబడి ముఖాన్ని కాకుండా ఛాతీని చూస్తూ ఉన్నాడు.

ఆమె ప్రశ్నా పత్రంతో కవర్‌ చేసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో పరీక్ష రాయడం తనకు ఇబ్బందిగా మారింది’ అని బాధితురాలి సోదరి మీడియాకు వెల్లడించింది. కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించామని, ఇదే పాఠశాలలో పరీక్షకు హాజరైన ఇతర విద్యార్థులతో మాట్లాడుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో తమకెలాంటి ఫిర్యాదు అందలేదని సీబీఎస్‌ఈ ప్రాంతీయ అధికారి తరుణ్‌ కుమార్‌ చెప్పారు. దేశవ్యాప్తంగా మే 6న నీట్‌ను సీబీఎస్‌ఈ నిర్వహించింది. 

మరిన్ని వార్తలు