16 Oct, 2018 16:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హీరా గోల్డ్‌ ఛైర్మన్‌ షేక్‌ నౌహీరా భేగం మంగళవారం సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎక్కువ శాతం వడ్డీ చెల్లిస్తామని వినియోగదారులకు ఎర వేస్తూ హీరా గోల్డ్‌ దేశవ్యాప్తంగా వందల కోట్లు డిపాజిట్లు సేకరించింది. హైదరాబాద్, తిరుపతి బెంగళూరు, ముంబైలతో పాటు పలు రాష్ట్రాల్లో హీరాగోల్డ్ పై కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 16 కంపెనీల పేరుతో భారీ మోసం జరిగిందని గుర్తించిన పోలీసులు 160 బ్యాంకుల్లోని అకౌంట్స్‌తో ఈ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. నౌరా షేక్  అరెస్ట్ తో లక్షలాది మంది డిపాజిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: హీరా..మరో అగ్రిగోల్డ్‌ కానుందా?

మరిన్ని వార్తలు