మదనపల్లెలో  పట్టపగలు భారీ చోరీ

20 Apr, 2018 11:37 IST|Sakshi
సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు

రూ.10 లక్షల బంగారం, నగదు అపహరణ

కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు

మదపసల్లె క్రైం : మదనపల్లె పట్టణంలో గురువారం పట్టపగలే దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. బీరువా లాకర్లను ధ్వంసంచేసి అందులో ఉన్న 300 గ్రాముల బంగారు నగలు, రూ.లక్ష నగదు అపహరించారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని కదిరి రోడ్డు న్యాయమూర్తుల బంగ్లా సమీపంలో నివాసం ఉంటున్న పరుపుల వ్యాపారి దర్బార్‌బాషా, అతని భార్య దిల్షాద్‌ గురువారం ఉదయం ఇంటికి తాళం వేసుకుని ఎస్టేట్‌లో పరుపులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీ వద్దకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని 11 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించి లోనికి వెళ్లి పరిశీలించారు. బీరువాలు, కప్‌బోర్డులను పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించారు.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. ఈ విషయమై వన్‌టౌన్‌ ఎస్‌ఐ సుమన్‌ను వివరణ కోరగా చోరీపై తమకు ఫిర్యాదు అందిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు