భార్య రాలేదన్న మనస్తాపంతో..

30 Oct, 2019 11:55 IST|Sakshi
నూతలపాటి వీరబాబు (ఫైల్‌ ఫొటో)

ఉరేసుకుని యువకుడి మృతి

తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: పుట్టింటి నుంచి భార్య రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఇంట్లో ఫ్యాన్‌ ఉక్కుకు లుంగీతో ఉరేసుకొని మరణించాడు. టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ పి ఈశ్వరుడు కథనం ప్రకారం.. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 47వ డివిజన్‌ ఎస్‌ అచ్యుతాపురం రావిచెట్టువీధికి చెందిన నూతలపాటి వీరబాబు (22)కి గొల్లప్రోలుకు చెందిన సత్యవేణితో నాలుగు నెలల క్రితం వివాహమైంది. పెళ్లయిన దగ్గర నుంచి భార్య సత్యవేణి పుట్టింటికి వెళ్లిపోతుండడంతో ఈనెల 16న తన భార్యను తీసుకువచ్చేందుకు వీరబాబు గొల్లప్రోలు వెళ్లాడు. తన భార్యను పంపించాలని అడగడంతో అత్త, మామ, బావమరిది భార్య కలసి వీరబాబును కొట్టి పంపించేశారు. భార్యపై ఆపేక్ష పెంచుకున్న వీరబాబు మళ్లీ దీపావళి పండగకు గొల్లప్రోలు వెళ్లాడు. అత్తింటి వారు పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో తిరిగి వచ్చి సోమవారం రాత్రి తన ఇంట్లోనే లుంగీతో ఫ్యాన్‌ ఉక్కుకు ఉరేసుకుని చనిపోయినట్టు సీఐ ఈశ్వరుడు తెలిపారు. మృతుడు తల్లి వెంకాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా