భారీగా పశువుల అక్రమ రవాణా

22 Aug, 2018 09:56 IST|Sakshi
వాహనంలో ఉన్న పశువులను పరిశీలిస్తున్న  సీఐ గురవయ్య, ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి   

చేవెళ్ల రంగారెడ్డి : బక్రీద్‌ పండుగ నేపథ్యంలో చెక్‌పోస్టు వద్ద చేపట్టిన తనిఖీల్లో పశువులను అమ్మకానికి తరలిస్తున్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ గురవయ్య తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్‌ చౌరస్తాలో ఉన్న చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులు తనిఖీ చేపట్టారు. చేవెళ్ల నుంచి హైదరాబాద్‌ నగరానికి నాలుగు వాహనాల్లో పశువులను తరలిస్తున్నారు. పోలీసులు వాహనాలను నిలిపి తనిఖీ చేస్తుండగా వాటిల్లో 44 ఆవు దూడలు ఉన్నాయి.

వాహనాలను స్వాధీనం చేసుకొని, తొమ్మిది మంది నిందితులు మహ్మద్‌ ఖదీర్, జహంగీర్, అఫ్సర్, వెంకటేష్, మల్కప్ప, సాజిద్, ఫరూక్‌ ఖాన్, అర్షద్‌ఖాన్, సయ్యద్‌ యాసిన్‌లను అరెస్టు చేశారు. సంతలో కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు వారు ఒప్పుకున్నారు. ఆవు దూడలను జీడిమెట్లలోని గోశాలకు తరలించినట్లు సీఐ చెప్పారు.

మరిన్ని వార్తలు