మద్యంసేవించి ఐఏఎస్‌ డ్రైవింగ్‌.. జర్నలిస్ట్‌ మృతి

3 Aug, 2019 13:22 IST|Sakshi
బషీర్‌ (ఫైల్‌ఫోటో)

తిరువనంతపురం: మద్యం సేవించే కారు ప్రమాదం చేసిన ఐఏఎస్‌ అధికారి ఓ జర్నలిస్ట్‌ మృతికి కారణమయ్యాడు. మితిమీరిన వేగంతో కారును నడిపి ఓ జర్నలిస్ట్‌ ప్రాణాన్ని బలిగొన్నాడు. కేరళకు చెందిన శ్రీరామ్‌ వెంకటరామన్‌ అనే ఐఏఎస్‌ అధికారి కారు వేగంగా నడిపి బైక్‌పై వెళ్తున్న పాత్రికేయుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రముఖ మలయాళ పత్రిక ‘సిరాజ్‌’ బ్యూరో ఛీఫ్‌ మహమ్మద్‌ బషీర్‌(35) మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున త్రివేండ్రం మ్యూజియం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో అఫ్జా అనే  మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో  బైక్‌పై ఉన్న బషీర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ఉన్న ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

వెంకటరామన్‌ మోతాదుకి మించి మద్యం సేవించినట్లు వైద్యుల పరీక్షల్లో తేలింది. అయితే తాను కారు నడపలేదని, తన స్నేహితురాలే నడిపారని పోలీసులను నమ్మిం‍చే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడున్న స్థానికలు మాత్రం దీనికి భిన్నంగా చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ప్రమాదానికి గురైన కారు ఆ మహిళ పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే బషీర్‌ మృతిపై సరైన విధంగా విచారణలో జరపాలని కేరళ జర్నలిస్ట్‌ యూనియన్‌ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. బషీర్‌ మృతిపట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య

బ్యుటీషియన్‌ ఆత్మహత్య

ఏడో తరగతి నుంచే చోరీల బాట

నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు

ప్రేమపెళ్లి; మరణంలోనూ వీడని బంధం

నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఇంట్లో అందర్నీ చంపేసి.. తాను కూడా

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

తీవ్రంగా కొట్టి..గొంతు నులిమి చంపాడు

పెళ్లి చేసుకున్నాడు.. వదిలేశాడు!  

శిశువును రూ. 20 వేలకు అమ్మడానికి సిద్ధపడింది

తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అరెస్ట్‌

స్టేషన్‌లో నిందితుడి పుట్టినరోజు వేడుక

రూ. 1.30 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

పుట్టిన రోజు వేడుకలు చేసుకోకుండానే.. 

భార్య మృతిని తట్టుకోలేక..

మహిళ వద్ద చైన్‌ స్నాచింగ్‌

విద్యార్థిని కిడ్నాప్, హత్య

పెళ్లైన 20 రోజులకే భర్తను సజీవదహనం చేసిన భార్య

ఓలా క్యాబ్‌ అంటూ ప్రైవేటుకారులో...

తల్లి అస్థికలు నిమజ్జనం చేస్తుండగా..

యువతిని ర్యాగింగ్‌ పేరుతో వేధించారని: వైరల్‌

ఘరానా దొంగలు.. ఏసీలు రిపేరు చేస్తామంటూ..

జూదంలో భార్యను పణంగా పెట్టి..

80 మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

జిల్లాలో సారా పరవళ్లు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కిడ్నాప్‌ కలకలం

వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి

రూ.లక్ష కోసం ట్రిపుల్‌ తలాక్‌.. కేసు నమోదు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘కనకాల’పేటలో విషాదం

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా ‘RDX లవ్’

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!