పక్కా ప్లాన్‌తో వివాహితపై లైంగికదాడి

1 Jan, 2020 08:35 IST|Sakshi

ముగ్గురిపై కేసు నమోదు

సాక్షి, చిత్తూరు: నిమ్మనపల్లె  మండలంలో ఓ వివాహిత లైంగిక దాడికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.. ముష్టూరు పంచాయతీకి చెందిన ఓ వివాహిత ఆదివారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని పొలాల వద్ద పొరక ఊసలు సేకరించేందుకు వెళ్లింది. రెడ్డివారిపల్లె పంచాయతీ, పిట్టావాండ్లపల్లెవడ్డిపల్లెకు చెందిన ఉప్పుతోళ్ల మహేష్‌ అతని స్నేహితులు విజయ్, శివ ద్విచక్ర వాహనాల్లో అక్కడికి వెళ్లారు.

చదవండి: టీపీఓపై దాడి.. స్పందించిన మంత్రి బొత్స!

మహేష్‌ ఆమెతో ‘మీ అవ్వ చనిపోయింది.. నిన్ను తీసుకుని రమ్మన్నారు’ అని నమ్మ బలికాడు. ఆ మహిళ బాధపడుతూ అతని మోటార్‌ సైకిల్‌ ఎక్కింది. మహేష్‌ బైక్‌ను ఓ కొండవైపు తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని బోయకొండ ఆర్చి వద్ద వదలి పారిపోయారు. ఆమె సోమవారం ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం తెలిపింది. వారు మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నిమ్మనపల్లె ఎస్‌ఐ సహదేవి విచారణ జరిపి, నిందితుడు మహేష్‌, అతనికి సహకరించిన విజయ్, శివపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: శీలాన్ని శంకించి.. ఆపై అంతమొందించి!

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు