జర్నలిస్టు ఇంట్లో చోరీ : దారుణం

7 Sep, 2018 14:03 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలో దారుణమైన చోరీ కలకలం రేపింది. స్థానిక పత్రిక  మాతృభూమి కన్నూర్‌ ఎడిటర్‌ ఇంట్లో దొంగతనానికి పాల్పడి, భార్యభర్తలను తీవ్రంగా గాయపర్చిన ఉదంతం  రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించింది.  కన్నూర్‌ జిల్లా, తజే చొవ్వ ప్రాంతంలో  గురువారం తెల్లవారు ఝామున ఈ సంఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే  నలుగురు దొంగల ముఠా మాతృభూమి సంపాదకుడు  వినోద్ చంద్రన్ ఇంటిలోకి  చొరబడ్డారు.  వినోద్‌,  ఆయన భార్య సరితను, కళ్లకు గంతలు కట్టి,  తాళ్లతో కట్టేసి బీభత్సం సృష్టించారు. కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.  35వేల నగదు, 25 తుపాల బంగారాన్ని దోచుకున్నారు. అంతేనా ఏటీఎం కార్డులు, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్స్‌ ఎత్తుకు పోయారు. దాదాపు గంటసేపు స్వైర విహారం అనంతరం అక్కడినుంచి ఉడాయించారు. అయితే  పొరుగువారి సాయంతో బాధితులకు పోలీసులు ఫిర్యాదు చేశారు.  

తీవ్రంగా గాయపడిన వినోద్‌ దంపతులు ప్రస్తుతం ఎ.కె.జి. మెమోరియల్ ఆసుపత్రి  ఐసీయూలో చికిత్స పొందుతున్నారని  కన్నూర్ నగర సిఐ ప్రదీపన్ కన్నిప్పాయిల్  తెలిపారు.  నేరస్తులు హిందీ, ఇంగ్లీషుల్లో సంభాషించుకున్నారని, ఇది బయటి ముఠా పనికావచ్చనే అనుమానాలను వ్యక్తంచేశారు. సీఐతోపాటు కన్నూర్‌ డీఎస్‌పీ ఆధ్వర్యంలోఒక కమిటీ  విచారణ చేపట్టిందన్నారు. డాగ్‌ స్క్వాడ్‌, ఫింగర్‌ ప్రింట్‌ నిపుణులు  సంఘటనా స్థలాన్ని పరిశీలించిట్లు  తెలిపారు. ​మరోవైపు  దీనిపై పలు అధికార,ప్రతిపక్ష పార్టీనేతలు తీవ్రంగా స్పందించారు.  నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర మంత్రి రామచంద్రన్‌పోలీసులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు