అదృశ్యమైన బాలికల మృతి

8 Feb, 2020 13:29 IST|Sakshi
లక్ష్మీ పాండే(ఫైల్‌), పంచవతి తివారీ(ఫైల్‌)

రాయిఘర్‌ సమితిలో పాడుబడిన నేలబావిలో మృతదేహాల గుర్తింపు

బాధిత గ్రామాల్లో విషాదఛాయలు

మండెయి జాతరలో బలి ఇచ్చి ఉంటారని ఆరోపణ

ఒడిశా ,జయపురం: నవరంగపూర్‌ జిల్లాలోని రాయిఘర్‌ సమితిలో ఓ పాడుబడిన నేలబావిలో ఇద్దరు బాలికల మృతదేహాలను పోలీసులు శుక్రవారం కనుగొన్నారు. ఇదే విషయంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మృతులు గొన గ్రామానికి చెందిన ప్రకాష్‌ పాండే కూతురు లక్ష్మీ పాండే(9), పకనాపర గ్రామానికి చెందిన సియన్‌ తివారీ కూతురు పంచవతీ తివారీ(8)లుగా పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరు బాలికలు కొన్నిరోజుల నుంచి కనిపించకపోగా తమ పిల్లలను ఎవరో కిడ్నాప్‌ చేశారని బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదే విషయంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులకు బాలికల మృతదేహాలు కనిపించడం గమనార్హం. అయితే వారు ప్రమాదవశాత్తు చనిపోయారా..లేకపోతే వారిని ఎవరైనా చంపి ఉంటారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కస్‌కంగ్‌ గ్రామంలో జరిగే మండెయి జాతరలో ఏటా ఇద్దరు మైనర్‌ బాలికలను బలి ఇస్తుంటారు. ఈ క్రమంలో వారిని జాతర బలికోసమే కిడ్నాప్‌ చేసి, చంపిన తర్వాత వారి మృతదేహాలను బావిలో పడేసి ఉంటారని బాధిత తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం బాధిత గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం బాలికల మృతదేహాలను ఆస్పత్రికి తరలించామని, రిపోర్టు వచ్చాక మృతికి గల కారణాలు తెలియస్తాయని నవరంగపూర్‌ ఎస్‌పీ నితిన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు