భార్య కళ్లెదుటే భర్త హత్య

4 Jun, 2018 01:38 IST|Sakshi

హత్నూర (సంగారెడ్డి): కళ్లలో కారం చల్లి.. ఇంట్లో నుంచి బయటకు ఈడ్చు కొచ్చి భార్య కళ్లెదుటే భర్తను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన ఘటన  సంగారెడ్డి జిల్లా హత్నూర మండ లం సాదుల్ల నగర్‌లో చోటు చేసుకుంది. సాదుల్ల నగర్‌కు చెందిన చెక్కల భాస్కర్‌(32) మండలంలోని బోర్పట్ల శివారు లోని ఓ పరిశ్రమలో లేబర్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు.

ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉండ గా, అదే గ్రామానికి చెందిన వరుసకు మేనబావ అయిన ఎర్రొల్ల ప్రభాకర్, ఎర్రొల్ల రమేశ్, ఎర్రొల్ల వీరేశం, శ్రీకాంత్‌తో పాటు మరికొందరు ఇంట్లోకి చొరబడి కారంపొడిని భాస్కర్‌ కళ్లల్లో చల్లడంతో కుప్పకూలిపోయాడు. అనంతరం అతన్ని బయటకు ఈడ్చుకొచ్చి గొడ్డళ్లతో విచక్షణా రహితంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య కవిత కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేసరికే దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు