న్యాయం చేయాలని రాస్తారోకో

6 Jul, 2018 14:17 IST|Sakshi
రాస్తారోకో చేస్తున్న బంధువులు

పాటిమట్ల ఎక్స్‌ రోడ్డుపై  ౖబైఠాయించిన ఉమ బంధువులు

మృతదేహంతో వెళ్తున్న అంబులెన్స్‌ అడ్డగింత

ఏసీపీ హామీతో ఆందోళన   విరమణ

అడ్డగూడూరు (తుంగతుర్తి) : వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన శ్రీరాముల ఉమ కుమార్తెకు నాయ్యం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉమ బంధువులు గురువారం పాటిమట్ల ఎక్స్‌రోడ్డు వద్ద రాస్తారోకో చేశారు. మండల పరిధిలోని చిర్రగూడూరు గ్రామంలో బుధవారం ఉదయం కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్న ఘటనలో శ్రీరాములు ఉమ(29), కూతురు అశ్విత (8 నెలలు) మృతి చెందిన విషయం పాఠకులకు విధితమే.

మృతదేహాలకు గురువారం పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం చిర్రగూడురుకు తీసుకొస్తున్న సమయంలో పాటిమట్ల ఎక్స్‌రోడ్డు వద్ద ఉమ బంధువులు అబ్లులెన్స్‌ను అడ్డుకున్నారు. ఉమ కూతురు మిల్కీకి నాయ్యం చేయాలని.. ఆమె పేరును రూ.5లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని, తండ్రి అశోక్‌ పేరున ఉన్న భూమిని మిల్కీ పేరున రిజిస్ట్రేషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

డిమాండ్లకు ఒప్పుకునే వరకు ఆందోళన విరమించేది లేదని రోడ్డుపై రెండు గంటలపాటు భీష్మించారు. ఈ సమయంలో పోలీసులకు, ఆందోళనకారులకు నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న  ఏసీపీ రమేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను విచారించి.. నాయ్యం జరిగేలా చేస్తామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు.

వివాహేతర సంబంధం వల్లే నా కూతురిని కోల్పోయా..

నా అల్లుడు అశోక్‌కు అదే గ్రామానికి చెందిన వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దీంతో తరచూ నా కూతురుతో గోడవపడేవాడు. దీనిపై పెద్దమనుషుల్లో పెట్టి పలుమార్లు హెచ్చరించినా వినలేదు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తుండనే.. అశోక్‌ నా కూతురిని హతమార్చాడు. అని ఆవేదన వ్యక్తం చేసింది. 
- ఉమ తల్లి చంద్రమ్మ


 

మరిన్ని వార్తలు