యాంకర్‌ కారు ఢీకొన్న వ్యక్తికి పోలీసుల రక్తదానం

22 May, 2018 13:24 IST|Sakshi
రక్తదానం చేస్తున్న డీసీపీ మల్లారెడ్డి

మానవత్వం చాటిన పోలీస్‌ అధికారులు

రోడ్డు ప్రమాద బాధితుడికి రక్తదానం

జనగామ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయప డి ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రుడికి రక్తదా నం చేసి ఇద్దరు పోలీసు అధికారులు తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. రఘునాథపల్లి మండల శివారు నిడిగొండ వద్ద సోమవారం జరి గిన రోడ్డు ప్రమాదంలో ఖిలాషాపూర్‌కు చెందిన మేడ కుమార్‌ (21) తల, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి.

అయితే ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కుమార్‌ను జనగామ జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. కొన ఊపిరితో ఉన్న క్షతగాత్రుడికి వైద్యులు ఆక్సిజన్‌తో పాటు ఇతర వైద్య సేవలు అందిస్తూ కాపాడే ప్రయత్నం చేశారు. అయితే రక్తం అవసరముండడంతో అక్క డే ఉన్న జనగామ డీసీపీ మల్లారెడ్డి, రఘునాథపల్లి సీఐ చంద్రశేఖర్‌గౌడ్‌ మేమున్నామంటూ స్పం దించారు.

వెంటనే ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ సుగుణాకర్‌ పర్యవేక్షణలో బ్లడ్‌ బ్యాంకు ఇన్‌చార్జి డాక్టర్‌ రాంనర్సయ్య వారి నుంచి రెండు యూనిట్ల రక్తం తీసుకుని కుమార్‌కు ఎక్కించారు. రెండు గంటల పాటు ప్రాణాలతో కొట్టుమి ట్టాడుతూ చివరకు కుమార్‌ తుదిశ్వాస విడిచారు.

కాగా, కుమార్‌ ప్రాణాలను రక్షించేందుకు జిల్లా పోలీసు యం త్రాంగం చేసిన కృషిచేసినా..ఫలించకపోవడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం లోబోను పంపించి వేయడంపై సిబ్బందిపై ఆర్‌ఎంఓ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు