పబ్‌జీ వ్యసనం మరొకరి ప్రాణం తీసింది

7 Jun, 2020 10:26 IST|Sakshi

జైపూర్‌‌ : పబ్‌జీ వ్యసనంతో 14 ఏళ్ల బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్‌ రాష్ట్రం కోటాలో జరిగింది. రైల్వే కాలనీ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ హన్స్‌రాజ్‌ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియన్‌ ఆర్మీకి చెందిన ఓ వ్యక్తి కుమారుడు 9వ తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం తన తల్లి మొబైల్‌ ఫోన్‌ నుంచి గేమింగ్‌ ప్రోగ్రామ్‌ను డౌన్‌లోడ్‌ చేశాడు. అప్పటి నుంచి నిరంతరాయంగా పబ్‌జీ గేమ్‌ను ఆడుతున్నాడు. 

గత రాత్రి 3 గంటల సమయంలో నిద్ర పోవాలని.. చదువుకుంటున్న తన సోదరుడికి చెప్పి మరో గదిలోకి వెళ్లి వెంటిలేటర్‌ గ్రిల్‌కి ఉరివేసుకొని మరణించాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా.. బాలుడు తన తల్లి, సోదరుడితో కలిసి కోటా గాంధీ కాలనీలో నివాసం ఉంటుండగా, అతడి తండ్రి ప్రస్తుతం అరుణాచల్‌ ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

చదవండి: మహిళా సర్పంచ్‌కు కలెక్టర్‌ ప్రశంస 

మరిన్ని వార్తలు