మత మార్పిడి ముఠా గుట్టు రట్టు

20 Nov, 2017 10:18 IST|Sakshi

ఉప్పల్‌: విద్యార్థులను మతమార్పిడికి పాల్పడుతున్న ఓ ముఠాను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఇందుకు సంబంధించి మల్కాజిగిరి ఏసీపీ కార్యాలయంలో ఆదివారం ఏసీపీ సందీప్‌రావు, మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్‌ జానకిరెడ్డితో కలిసి వెల్లడించారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ సిద్దిఖి అలియాజ్‌ సత్యనారాయణ నగరంలోని నాదర్‌గుల్‌ మెగా డ్రీమ్‌ సిటీలో నివాసం ఉంటున్నాడు.  ముందు క్రిస్టియన్‌గామారి ఆ తరువాత ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. కొందరికితో కలిసి ముఠాగా ఏర్పడి పీస్‌ అర్బన్‌ హోమ్‌ సొసైటీని ఏర్పాటుచేసుకున్నారు. చిన్నారులకు విద్య నేర్పుతామంటూ ప్రచారం చేసేవారు. 

మహబూబ్‌నగర్, సూర్యాపేటలతో పాటు వెనుకబడిన ప్రాంతాలలో 4–14 సంవత్సరాలలోపు గల ఎస్సీ, ఎస్టీ బాలబాలికలను ఎంపిక చేసుకొని ఉచితంగా చదువు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు.  మొదట్లో ఎర్రకుంటలో స్థావరాన్ని ఏర్పాటుచేసుకొని  తరువాత రెండు నెలల క్రితం మౌలాలిలోకి స్కూల్‌ను మార్చారు. అయితే అక్కడ విద్యార్థులను బలవంతంగా మతానికి సంబంధించిన విషయాలు చెబుతూ మతమార్పిడికి యత్నిస్తున్నారని  చైల్డ్‌ సొసైటీ నిర్వాహకులుఫిర్యాదు చేశారు. దీంతో దాడిచేసి 10 మంది బాలురు, 7 మంది బాలికలను అదుపులోకి తీసుకొని చైల్డ్‌ హోమ్‌కు తరలించారు. మతమార్పిడిలకు పాల్పడుతున్న ముఠాలోని 9 మంది సభ్యులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఒక్కరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు