రెప్పపాటు క్షణంలో ఘోర ప్రమాదం

26 Apr, 2019 17:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని ఐడీఏ బొల్లారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. టాటా ఏస్‌  ప్యాసింజర్ ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్ల రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. వివరాల్లోకి వెళితే...సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన కనక మహాలక్ష్మీ బొల్లారంలో ఓ కార్యాలయంలో లేబర్‌గా పని చేస్తోంది. ఆమె ఇవాళ మధ్యాహ్నం విధులకు వెళ్లేందుకు తన మరిది సైదులు రెడ్డి ద్విచక్ర వాహనంపై బయల్దేరింది. వీరు వెళుతుండగా రోడ్డుపై ఆగివున్న టాటా ఏస్‌ డ్రైవర్‌ ఒక్కసారిగా డోర్‌ తీయడంతో ... వదినా, మరిది ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో పక్కనే వెళుతున్న టిప్పర్‌ కింద పడిపోవడం...వారిపై నుంచి టైర్లు వెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై సీసీ టీవీ పుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర‍్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు