బాలికపై రౌడీషీటర్‌ లైంగికదాడి

18 Dec, 2019 12:28 IST|Sakshi

ఆలస్యంగా వెలుగులోకి ఘటన

నిందితుడి అరెస్టు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): బాలికపై ఓ రౌడీషీటర్‌ లైంగిక దాడి చేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. విజయవాడకు చెందిన బాలిక ఓ ప్రైవేటు స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి బీసెంట్‌ రోడ్డుకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఏలూరు రోడ్డులోని రాజ్‌ టవర్స్‌ వద్ద ఆటో కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో అటుగా వెళుతున్న గుణదలకు చెందిన రౌడీషీటర్‌ చిన్నిరాజా(వరుణ్‌కుమార్‌) బాలికను తన బైక్‌పై ఎక్కించుకు వెళ్లాడు. గుణదల ఈఎస్‌ఐ హాస్పిటల్‌ వెనుక భాగంలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.

ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి స్నేహితులను ఆరా తీశాడు. బైక్‌పై వెళ్లిందని తెలుసుకుని వెతకడం ఆరంభించాడు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఈఎస్‌ఐ హాస్పిటల్‌ వద్ద ఆమె ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఆయన అక్కడకు వెళ్లడంతో బాలిక జరిగిన విషయం ఆమె తండ్రికి వివరించింది. బాలిక తండ్రి నేరుగా గవర్నర్‌పేట పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక మైనర్‌ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా నిందితుడిపై మాచవరం పోలీసుస్టేషన్‌లో పలు కేసులు ఉన్నాయి.   
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా