అన్న ఇంటికే కన్నం వేసిన సోదరి

4 Jun, 2020 15:44 IST|Sakshi

సాక్షి, కృష్ణా : డబ్బు మైకం కమ్మేయటంతో సంబంధ బాంధవ్యాలను పక్కన పడేసింది ఓ మహిళ. క్రిమినల్స్‌తో చేతులు కలిపి సొంత అన్న ఇంటికే కన్నం వేయడానికి పక్కా స్కెచ్ గీసింది. మూడో కంటిన పడకుండా సినీ ఫక్కీలో దోపిడీ చేయించింది. పాపం పండటంతో ఖాకీల చేతికి చిక్కి కటకటాల పాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా గుడివాడలోని ధనియాలపేటకు చెందిన పిల్లిమెట్ల నాగరాజు గతనెల 27న తనకు సంబంధించిన ఓ స్థలాన్ని విక్రయించారు. దానికి వచ్చిన పదిలక్షల డబ్బును ఇంటికి తెచ్చి భద్రపరిచారు. మొదటి నుంచీ నాగరాజు ఎదుగుదలను ద్వేషించే పిన్ని కూతురు కుమారి కన్ను ఆ డబ్బుపై పడింది. ఎలాగైనా డబ్బుకొట్టేసి నాగరాజును దెబ్బతీయాలని కుట్ర పన్నింది. (మద్యం అక్రమ రవాణా.. ఉపాధ్యాయుడి అరెస్ట్‌)

తెలిసిన పాత నేరస్థులతో చేతులు కలిపి దోపిడికి పథకం రచించింది. ఆరుగురురితో ఓ ముఠాను తయారు చేసింది. ఈ క్రమంలోనే 29న తన స్కెచ్‌ను అమలు చేసింది. అర్థరాత్రి తానే వెళ్లి కాలింగ్ బెల్ కొట్టి.. ఆరుగురు దొంగలతో కలిసి కత్తులతో బెందిరించి ఇంట్లో ఉన్న పది లక్షలతో పాటు బంగారాన్ని సైతం ఊడ్చుకెళ్లింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సమీపంలోని సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా ఐదురోజుల వ్యవధిలోనే కేసును ఛేదించారు. కుమారీతో పాటు దోపిడికి పాల్పడ్డ అరడజను దొంగలను అదుపులోకి తీసుకున్నారు. (సొంత బ్యాంకు‌కే కన్నం వేసిన క్యాషియర్‌)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు