తల్లిని చంపిన కుమారుడి అరెస్ట్‌

13 Mar, 2020 13:00 IST|Sakshi
నిందితుడిని అరెస్ట్‌ చూపుతున్న డీఎస్పీలు రామకృష్ణ, భవ్యకిశోర్‌

కర్నూలు,ఎమ్మిగనూరు రూరల్‌: పట్టణంలోని లక్ష్మీపేటలో తల్లిని చంపిన కుమారుడిని పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. స్థానిక టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆదోని డీఎస్పీ పి.రామక్షృష్ణ, ఎన్నికల స్పెషల్‌ డీఎస్పీ భవ్యకిశోర్‌ల ఆధ్వర్యంలో ముద్దాయిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ పి.రామకృష్ణ మాట్లాడుతూ పట్టణానికి చెందిన బోయ ఉరుకుందమ్మను కుమారుడు బోయ ఆకుల వీరేష్‌ అత్యంత కిరాతకంగా బండరాయితో మోది హత్య చేశాడన్నారు. చెడు వ్యసనాలకు అలవాటుపడి మద్యం తాగి వచ్చి, తన కోర్కె తీర్చాలంటూ వీరేష్‌ ఈ నెల 11న కన్నతల్లితో గొడవ పడ్డాడన్నారు. మందలించిన తండ్రి, సోదరుడిపై దాడికి యత్నించగా అడ్డుకునేందుకు వెళ్లిన తల్లి తలపై బండ రాయితో మోది హత్య చేశాడన్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామన్నారు. సోగనూరు రోడ్డులోని జెడ్పీ హైస్కూల్‌ వద్ద ఉన్న నిందితుడిని అరెస్ట్‌ చేసి, కోర్టులో హాజరుపర్చగా మెజిస్ట్రేట్‌ వాసుదేవ్‌ రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో టౌన్‌ సీఐ వి.శ్రీధర్, ఎస్‌ఐ శ్రీనివాసులు, హెచ్‌సీ సుభాన్, ఖాద్రీ, పీసీలు దశరథరాముడు, సుధాకర్, సమీవుల్లా, రహిమాన్‌ పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా