నడుస్తున్న కారులో మంటలు : టెకీ మృతి

25 Dec, 2018 18:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నోయిడాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పవన్ (45) కారులో చెలరేగిన మంటల్లో చిక్కుకొని మరణించారు. రాత్రి షిప్ట్‌ ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా  ఆయన ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. దీంతో మరికొద్ది క్షణాల్లో ఇంటికి చేరాల్సిన ఆయన కారునుంచి బయటకు రాలేక ప్రాణాలు విడిచారు. మంగళవారం తెల్లవారు ఝామున ఈ విషాదం చోటు చేసుకుంది.  అప్పటివరకు అందరికీ  క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన పవన్‌ ఇకలేరన్నవార్తను, కుటుంబ సభ్యులు. సన్నిహితులు  నమ్మలేకపోతున్నారు.

గ్రేటర్ నోయిడా పొలీసు ఉన్నతాధికారి నిశాంత్ శర్మ అందించిన సమాచారం ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లోని అంబాకు చెందిన పవన్ ఒక ప్రయివేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. సోమవారం  నైట్‌షిప్ట్‌ అనంతరం తిరిగి ఇంటికి వస్తుండగా పవన్‌ ప్రయాణిస్తున్న ఫోర్డ్‌ ఐకాన్‌ కారులో మంటలంటుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే  బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్నిస్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అయితే కారు నెంబరు ఆధారంగా మృతుడిని గుర్తించిన అధికారులు బంధువులకు సమాచారం అందించారు. షార్ట్‌ సర్క్యూట్‌, బ్లోవర్ సమస్యలు ప్రమాదానికి కారణం కావచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. అయితే దర్యాప్తు కొనసాగుతోందని  నిశాంత్‌ శర్మ చెప్పారు.

ఉదయం 5గంటల వరకు క్రిస్మస్ స్నేహితులకు, బంధువులకు శుభాకాంక్షలు  అందించినట్టు తెలుస్తోందనీ,  అయితే అకస్మాత్తుగా మంటలంటుకోవడంతో వాహనం నుండి బయటికి రాలేక పవన్‌ చనిపోయారని మరో పోలీసు అధికారి రామ్‌పాల్‌ తోమార్ చెప్పారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 100 మంది

సొంత చెల్లెలిపై అకృత్యం.. దారుణ హత్య

వివాహానికి వెళ్లి వస్తూ మృత్యు ఒడికి

గుండె నిండా బాధతోనే పరీక్షకు..

పొట్టకూటి కోసం వచ్చి.. పరలోకానికి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదల వాయిదా

డ్రైవర్‌, పనిమనిషికి హీరోయిన్‌ భారీ సాయం

సౌత్‌లో మరో బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌

ముందే వస్తున్న మోదీ బయోపిక్‌

వద్దనుకుంటే కళ్లు మూసుకుని కూర్చోండి

నయన్‌ది ఆశా? అత్యాశా?