ఇంట్లో నిద్రిస్తుండగానే చోరీ!

16 Jan, 2018 19:27 IST|Sakshi

సాక్షి, కుషాయిగూడ: ఇంట్లోని వాళ్లు నిద్రిస్తుండగానే దొంగలు లోనికి చొరబడి ఎంచక్కా తమ పని కానిచ్చుకుని వెళ్లిపోయారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ ఎ.ఎస్.రావు నగర్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆదిమల్లు అనే వ్యక్తి తన ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో దొంగలు చాకచక్యంగా ఆ ఇంటి తలుపు గడియ తొలగించి లోపలికి జొరబడ్డారు. పది తులాల బంగారు ఆభరణాలు, రూ.1.20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు