బంధువుల ఇంట్లో.. జరిగే శుభకార్యానికి వెళ్లొస్తూ..

24 Nov, 2023 09:43 IST|Sakshi
రాకేశ్‌ (ఫైల్‌)

సాక్షి, కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన దాసరి లచ్చయ్య– నర్సమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు రాకేశ్‌ (20) ఉన్నాడు. గురువారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్లాడు. సాయంత్రం ఇద్దరు స్నేహితులతో కలిసి పనినిమిత్తం బైక్‌పై వెళ్తుండగా లక్షెట్టిపేట వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కారును ఢీకొట్టారు.

స్నేహితులద్దిరికీ స్వల్పగాయాలు కాగా రాకేశ్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. చేతికందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. రాకేశ్‌ ఇంటర్‌ వరకు చదివి పట్టణంలోని ఓ కిరాణ దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నాడు. రాకేశ్‌ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
ఇవి చదవండి: దుబాయ్‌లో భ‌ర్త‌.. మ‌రో యువ‌కుడి కార‌ణంగా.. వివాహిత తీవ్ర నిర్ణ‌యం!

మరిన్ని వార్తలు