హైదరాబాద్‌లో ఏటీఎం చోరీకి యత్నం

23 Dec, 2019 07:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఓ ఏటీఎంలో చోరీకి యత్నించిన దుండగులను పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన నగరంలోని ఫలక్‌నుమాలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫలక్‌నుమాలోని సిండికేట్‌ బ్యాంక్‌ ఏటీఎంలో నలుగురు దుండగులు చోరీకి యత్నించారు. చోరీకి పాల్పడుతున్న వారిని పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను మొబిన్‌, సాజిద్‌, షేక్‌ ఖాసీంగా గుర్తించారు. దుండగులపై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ముగ్గురు గతంలో నిజాం మ్యూజియంలో దొంగతనం చేశారు. 

మరిన్ని వార్తలు