రిమ్స్‌ ఆవరణలో మిన్నంటిన రోదనలు

4 Jan, 2020 12:04 IST|Sakshi
రిమ్స్‌ మార్చురీ వద్ద విషాదంలో బంధువులు

రెండు కుటుంబాల్లో తీరని విషాదం  

వచ్చింది....ఐదుగురు.... వెళుతోంది ....ఇద్దరే...!  

అనాథలుగా అన్వర్‌బాషా భార్య, కుమార్తె

కడప అర్బన్‌:   ‘యా.. అల్లాహ్‌..’.‘ఎంతపని జరిగింది దేవుడా...’! అంటూ మృతుల కుటుంబాల రోదనలు రిమ్స్‌ మార్చూరీ ఆవరణలో మిన్నంటాయి.. గురువారం సాయంత్రం సిద్దవటం మండలంలోని పెన్నా తీరంలో జరిగిన దారుణ ఘటనతో ముగ్గురు బిడ్డలను పోగొట్టు కున్న గౌస్‌పీర్, ముంతాజ్‌ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.. అటు భర్త చనిపోవడంతో అన్వర్‌బాషా భార్య , కుమార్తె అనాథలుగా మిగిలారు. శుక్రవారం రిమ్స్‌ ఆవరణలో మృతదేహాల పోస్టుమార్టం సందర్భంగా రిమ్స్‌ ఆవరణలో శుక్రవారం విషాదఛాయలు అలముకున్నాయి.  ముగ్గురు చిన్నారుల శవాలు.. పక్కనే మేనమామ మృతదేహాన్ని చూస్తూ.. ‘ఏం పాపం చేశారని ఈ శిక్ష వేశావు దేవుడా.. ఎందుకింత అన్యాయం చేశావు..’ అంటూ బంధువులు గుండెలు బాదుకుంటుంటే.. అది చూసిన ప్రతి ఒక్కరూ కంట నీరు కార్చారు. అక్కడికొచ్చిన బంధుమిత్రులెవరిని కదిలించినా కన్నీరే సమాధానమైంది.

ప్రాణం మీదకు తెస్తున్నఈత సరదా..
పెన్నా పరీవాహక ప్రాంతంతో పాటు జిల్లాలోని పలు నదీపరీవాహక ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి. పండుగ వస్తేనే.. సెలవులుంటేనో ఈత కోసం సరదాగా వెళ్లడం, ఈత రాక మడుగుల్లో చిక్కుకునిపోయి ప్రాణాలనుకోల్పోతున్న ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఘటనతో పాటు.. ఈనెల 2వ తేదీ సాయంత్రం సిద్దవటం మండల పరిధిలోని వంతెన సమీపంలో జరిగిన దుర్ఘటన ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. కాగా పెన్నానది నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో పోలీసు ఉన్నతాధికారులు అక్కడ కూడా కొంతమంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నారు. అయితే ఉధృతి తగ్గిన తర్వాత వెళుతున్న ప్రజలు తమకు ఈత రాకపోయినా సరదాగా నీటిలో ఆడుకుంటూ కాలక్షేపం చేసి వస్తుంటారు. ఈ క్రమంలోనే తమకు తెలియకుండానే నీటిలో పడి, మునిగిపోయి  తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. 

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచైనా నష్టపరిహారం వచ్చేలా చూస్తాం...
వైఎస్‌ఆర్‌సిపి కడప పార్లమెంటరీ అధ్యక్షుడు, మాజీ మేయర్‌ కె. సురేష్‌బాబు ఈ సంఘటనను గురించి తెలుసుకున్న వైఎస్‌ఆర్‌ సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు కె. సురేష్‌బాబు శుక్రవారం కడప రిమ్స్‌ మార్చురీకి చేరుకున్నారు. అక్కడ మృతదేహాలను పరిశీలించిన ఆయన సంఘటన జరిగిన తీరును బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం తీరని విషాదమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్వర్‌బాష భార్య, కుమార్తెకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా చూస్తామని, లేకపోయినా సిఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి నష్టపరిహారం వచ్చేలా చూస్తామన్నారు. పెన్నానదిలోకి వెళ్లేవారికి తగిన జాగ్రత్తలను సూచిస్తూ, ప్రమాద హెచ్చరికల సూచికలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనీ, ఎప్పటికపుడు అప్రమత్తతగా వుంచేటా చూడాలనిఒంటిమిట్ట సిఐ హనుమంతనాయక్‌ను, సురేష్‌బాబు కోరారు.  పెన్నాలో పడి మృతిచెందిన నలుగురు మృతదేహాలకు రిమ్స్‌లో వైద్యులు, వైద్యసిబ్బంది  పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నం బంధువులకు మృతదేహాలను అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హనుమంతనాయక్‌ వెల్లడించారు.   

ఆ రెండు కుటుంబాల్లో...  
కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన గౌస్‌పీర్, ముంతాజ్‌లకు కుమారుడు జునైద్, కుమార్తెలు జోహా, ముదీహా, పదీహా సంతానం. ముంతాజ్, తన నలుగురు పిల్లలతో కలిసి గత నెల 28న తన సోదరుల ఇంటికొచ్చింది. తిరిగి వీరు ఈనెల 3న రాయచూరుకు వెళ్లాల్సి… ఉంది. కానీ ఇంతలోనే ఈ దారుణ ఘటన జరిగింది. నలుగురు పిల్లలతో వచ్చిన ముంతాజ్‌ ముగ్గురిని పోగొట్టుకుని ఒక్క కుమారుడితో వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు ఎలక్ట్రికలŒæ పనిచేసుకు…టూ జీవన… సాగిస్తున్న సోదర‡ుడు అన్వŠ‡ర్‌బాషా కుటుంబంలోనూ ఈ ఘటన తీరని విషాదాన్నే నింపింది. అన్వర్‌ 17 సంవత్పరాల క్రి™తం సునీ™తను ఆదర్శ వివాహ… చేసుకున్నాడు. వీరికి 15 సంవత్సరాల కుమార్తె ఉంది. ఈ దుర్ఘటనలో అన్వర్‌ బాషా ప్రాణాలను కోల్పోవోవడంతో భార్య, కుమార్తె అనాథలుగా మిగిలారు.

నదిలోకి రాకుండారోడ్డుకు ఇరువైపుల కంచె
సిద్దవటం: సిద్దవటం గ్రామ సమీపంలోని పెన్నానదిలోకి ఎవ్వరు దిగకుండా పాత వంతెన ఇరువైపుల కంపతో కంచె వేశామని ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గురువారం సాయంత్రం పెన్నానదిలో నలుగురు నీట మునిగి మృతి చెందిన సంఘటన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామన్నారు. నదిపై నిర్మించిన పాత వంతెన వద్ద మడుగు ఉండటంతో ఎవ్వరినీ దిగకుండా హైలెవల్‌ వంతెన స్తంభాలకు  హెచ్చరిక సూచనను ఏర్పాటు చేశారు.  ఆ ప్రదేశంలో ఎర్ర జండాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు