సూది వేయగానే స్పృహ కోల్పోయి కోమాలోకి

12 Jan, 2020 08:47 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ముద్దులొలికే పసిపాపకు అప్పుడే నూరేళ్లు నిండాయా? అని తల్లిదండ్రులు తీవ్రంగా విలపించారు. నర్స్‌ ఇచ్చిన ఇంజెక్షన్‌ వికటించి మూడు నెలల చిన్నారి కన్నుమూసినట్లు తెలిసింది. ఈ ఘటన బెళగావి జిల్లా గోకాక్‌ తాలూకా హుణశ్యాళ పీజీ గ్రామంలో శనివారం జరిగింది. చిన్నారికి జ్వరం వస్తే చూపిద్దామని అంగన్‌వాడీ సెంటర్‌కు తీసుకొచ్చారు. అక్కడి నర్స్‌ పెంటాపెస్ట్‌ అనే ఇంజెక్షన్‌ను పాపకు ఇచ్చింది.

సూది వేసిన వెంటనే చిన్నారి స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లిపోయిందని, తర్వాత కొంత సేపటికి మరణించిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. సాధారణంగా అంటువ్యాధులు వచ్చినప్పుడు మాత్రమే పెంటాపెస్ట్‌ ఇంజెక్షన్‌ ఇస్తారని, జ్వరం వచ్చినప్పుడు ఉపయోగించరని, కానీ ఈ నర్స్‌ చేసిన పనికి తమ చిన్నారిని పోగొట్టుకున్నట్లు వారు ఆరోపించారు. గోకాక్‌లోని ఆస్పత్రిలో చిన్నారి మృతదేహాన్ని తీసుకొచ్చి ఆందోళన చేశారు. నర్స్‌ నిర్లక్ష్యం వల్లే తమ శిశువు మరణించిందని విలపించారు.   

చదవండి: టీచర్‌కు అయిదేళ్ల జైలు

తనకు దక్కదని.. మరెవరికీ దక్కొద్దని..

మరిన్ని వార్తలు