ఎలుగుబంట్లను వేటాడి వాటి మర్మాంగాలు..

23 Oct, 2019 09:01 IST|Sakshi
అరెస్టయిన వేటగాడు యార్లెన్ అలియాస్ లుజజెన్‌

భోపాల్‌ : పులులను, ఎలుగుబంట్లను చంపిన వేటగాడిని మధ్యప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆరేళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన ఆ వేటగాడు పోలీసుల విచారణలో పలు దిగ్ర్భాంతికర విషయాలు వెల్లడించాడు. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యార్లెన్ అలియాస్ లుజజెన్‌ అనే వేటగాడు నెమళ్లు, అడవి పందులు, ఎలుగు బంట్లను వేటాడి తినడంతో పాటు అమ్మేవాడు. 2014లో పులిని వేటాడి చంపిన కేసులో యార్లెన్ జైలుకు వెళ్లాడు. కొద్ది రోజుల తర్వాత బెయిల్‌పై తిరిగి వచ్చిన అతగాడు.. మళ్లీ వేటాడడం మొదలు పెట్టాడు. 
 
గత ఐదు సంవత్సరాల నుంచి పలు పులులు, ఎలుగుబంట్లు, వందల కొద్ది అడవి పందులు, నెమళ్లు వేటాడాడు. అతన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చేయని ప్రయత్నం లేదు. గుజరాత్-వడోదర జాతీయ రహదారిపై శాంటి ప్రాంతంలో ఉన్నట్టు యార్లెన్‌ను గుర్తించిన  పోలీసులు.. ఇటీవల పట్టుకున్నారు. ఎలుగుబంటి (బల్లుకం) కళేబరాలను అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఎలుగుబంట‍్లను చంపి వాటి మర్మాంగాలను తినేవాడని విచారణలో తేలింది.  కాంతా టైగర్ రిజర్వ్, చింద్వారా, బెతూల్, భెర్హన్ పూర్‌లో ఎలుగుబంట్లలను చంపి అమ్మేవాడనని వెల్లడించాడు. 

2012లో టి13 టైగర్ కనిపించకపోవడంతో అటవీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 2013 జనవరి 12న నేపాల్‌లో టి13 పులి చర్మాన్ని స్వాధీనం చేసుకొని డైమ్ అనే వ్యక్తి అరెస్టు చేసి విచారణ జరిపారు. దీంతో ఈ పులిని వేటాడిన వ్యక్తి యార్లెన్ అని విచారణలో తేలింది. అప్పటి నుంచి యార్లెన్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పక్కా సమాచారంలో గుజరాత్‌-వడోదర జాతీయ రహదారిలో యార్లెన్‌ను పట్టుకున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా