శీతల పానీయాల కేంద్రంపై విజిలెన్స్‌ దాడులు..

6 Jun, 2018 16:45 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : శీతల పానీయాల తయారీ కేంద్రంపై(ఖార్కాన్‌) బుధవారం విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. అంతేకాక డ్రింక్స్‌ తయారీలో నాణ్యత పాటించలేదని అధికారులు గుర్తించారు. దీంతో కూల్‌ పాయింట్‌ నిర్వహకులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాలివి.. జీవీఎంసీ పాయి మాధవ నగర్‌ పరిధిలో కృప ఏజెన్సీస్‌ పేరుతో పిల్లా శ్రీనివాస్‌ కూల్‌ పాయింట్‌ నిర్వహిస్తున్నాడు. వివిధ రకాల డ్రింక్స్‌ తయారు చేసి విక్రయిస్తున్నాడు. 

నాణ్యత ప్రమాణాలకు పాటించకుండా.. హానికరమైన రసాయనాలు వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకు విశాఖ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ అధికారులు, జీవీఎంసీ ఆహార భద్రత అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. కూల్‌ పాయింట్‌లో శాంపిల్స్‌ను కూడా అధికారులు సేకరించారు. కూల్‌ డ్రింక్స్‌ తయారీలో నాణ్యత ప్రమాణాలను పాటించడంలేదని అధికారులు వెల్లడించారు. వాస్తవానికి కూల్‌ డ్రింక్స్‌ తయారీలో శుద్ధి చేసిన మంచినీరు వినియోగించాల్సి ఉంది, అయితే అతను నేరుగా బోర్‌ నీటిని వినియోగిస్తున్నాడని అధికారుల చెప్పారు. 

అలాగే ప్రజలకు హాని కలిగించే మ్యాంగో, గ్రేప్స్‌, సాల్ట్‌ ప్లేవర్స్‌తో పాటుగా ఎసెన్స్‌.. కూల్‌ డ్రింక్స్‌ ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు ప్రిజవేట్యు అనే రసాయనాలు కలిపి ఈ పానీయాలను తయారు చేస్తున్నట్టు ఈ దాడుల్లో బయటపడ్డాయి. ఏ విధమైన ఫిల్టరైజేషన్‌ నీరు వాడకుండా కలుషితమైన దోమలు, ఈగలు వాలిని నీటిని వాడుతూ కూల్‌ డ్రింక్స్‌ తయారు చేసి వ్యాపారం చేస్తున్నారని అధికారులు తెలిపారు. శీతల పానీయాలు తయారీ కేంద్రం నుంచి సేకరించిన శ్యాంపిల్స్‌ను హైదరాబాద్‌ స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌ రేటరీ పంపించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుటామని అధికారులు చెప్పారు. కూల్‌ పాయింట్‌ నిర్వహకుడు పిల్లా శ్రీనివాస్‌ పై కేసు నమోదు చేసినట్లు డీఎస్సీ సీఎం నాయుడు తెలిపారు. 
 

మరిన్ని వార్తలు