సైబర్‌ శాడిస్టు బాగోతం వెలుగులోకి..

26 May, 2018 19:48 IST|Sakshi

సాక్షి, విజయవాడ : మహిళలను లక్ష్యంగా చేసుకొని వేదింపులకు గురిచేస్తున్న సైబర్‌ శాడిస్టు బాగోతం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడకు చెందిన ఓ కీచకుడు రుణాలు, స్కాలర్‌ షిప్‌లు ఇప్పిస్తానని మహిళలకు మోసపూరిత మాటలు చెప్పి, వారి దగ్గర నుంచి ఫొటోలు, ఫోన్‌ నంబర్లు సేకరించేవాడు. ఆ తర్వాత ఆ మహిళలు వేశ్యలంటూ వారి సమాచారాన్ని సోషలో మీడియాలో షేర్‌ చేస్తూండేవాడు. అయితే ఈ కీచకుడి దురాగతాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన పోలీసులకు నమ్మలేని నిజాలు తెలిసాయి. కోచింగ్‌ సెంటర్లు, కళాశాలల వద్ద కాపు కాసి వారిని మాయమాటలతో మభ్య పెట్టి  పూర్తి సమాచారం తెలుసుకునేవాడు. అలా ఇప్పటివరకు 50 మంది మహిళల వివరాలు సామాజిక మాధ్యమాల్లో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి నిందితుడి పూర్తి సమాచారం లభించలేదని కానీ ఆ కీచకుడు నగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని పోలీసులు తెలిపారు. ఆ సైబర్‌ శాడిస్టుపై ఐటీ యాక్ట్‌ 67, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు,  ఆ నిందుతుడి ఆచూకి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు