గన్‌మెన్‌ల తుపాకులు లాక్కొని చంపారు : డీఐజీ

23 Sep, 2018 15:41 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు అతి దగ్గర నుంచి కాల్చి చంపారని విశాఖ డీఐజీ శ్రీకాంత్‌ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో దాదాపు 20మంది మవోయిస్టులు ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు.ఎమ్మెల్యే గన్‌మెన్‌లను దూరంగా పంపి వారి వద్ద ఉన్న తుపాకులను లాక్కున్నారు. అనంతరం సర్వేశ్వరావు, సోమలను కిరాతంగా కాల్చి చంపారు.  రెండు టీమ్‌లుగా ఏర్పాడ్డ మావోలు మొదటగా సోమను కాల్చి చంపారు. అనంతరం సర్వేశ్వరావును కాల్చారు.  ఒడిశాకు 15 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఫైర్‌ తర్వాత మావోయిస్టులు పారిపోయారు.మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. దీనిపై పూర్తి విచారణ జరుపుతాం’ అని డీఐజీ  శ్రీకాంత్‌ పేర్కొన్నారు. 

అప్రమత్తమైన తెలుగు రాష్ట్రాల పోలీసులు
 అరకు ఘటనతో తెలుగు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. సమాచారం ఇవ్వకుండా ప్రజాప్రతినిధులు రూరల్‌ ఏరియాల్లోకి వెల్లోద్దని సూచించారు. తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల పర్యటనల వివరాలు ఇవ్వాలని తెలంగాణ పోలీసులు కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గట్టి నిఘా పెంచారు. ఎజెన్సీ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులకు భద్రత పెంచతున్నట్లు ప్రకటించారు. 

మరిన్ని వార్తలు