ఇంజినీరింగ్‌ విద్యార్థిని.. కాలేజీలో హఠాత్తుగా..

17 Nov, 2023 11:00 IST|Sakshi
ప్రదీప్తి (ఫైల్‌)

సాక్షి, కరీంనగర్: సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని గెంట్యాల ప్రదీప్తి(18) గురువారం గుండెపోటుతో మృతి చెందింది. ప్రదీప్తి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతోంది. మంగళవారం సాయంత్రం కాలేజీలో హఠాత్తుగా గుండెపోటుకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించింది.

ప్రదీప్తి హఠాన్మరణంతో ఆమె తల్లిదండ్రులు గెంట్యాల రేణుక–భూమేశ్‌లు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రదీప్తి మృతదేశాన్ని అంబులెన్స్‌లో సిరిసిల్ల లోని స్వగృహానికి తరలించారు. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. చిన్న వయసులోనే ఇంజినీరింగ్‌ విద్యార్థిని గుండెపోటుతో మరణించడం సిరిసిల్లలో విషాదం నింపింది.
ఇవి కూడా చదవండి: పాతబడిన భవనం వద్దకు తీసుకెళ్లి.. చిన్నారిపై దారుణంగా..

మరిన్ని వార్తలు