గార్డ్‌ ఎదుటే ట్రెయిన్‌లో మహిళపై వేధింపులు

6 Apr, 2018 12:50 IST|Sakshi
మహిళలను వేదిస్తున్నదుండగుడు

దాదర్‌-కుర్లా లోకల్‌ ట్రెయిన్‌లో ఘటన

ముంబై : దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటనలు తరచూ వెలుగు చూస్తుండగా.. భారత  ఆర్థిక రాజధాని ముంబైలోనూ మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ముంబైలో దాదర్‌-కుర్లా లోకల్‌ ట్రెయిన్‌లో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఓ ఘటన ఈ విషయాన్ని మరోసారి తేటతెల్లం చేసింది. 

దివ్యాంగులకు కేటాయించిన కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన ఓ దుండగుడు తోటి ప్రయాణికురాలి పట్ల లైంగిక వేదింపులకు దిగాడు. అక్కడున్న వారంతా దివ్యాంగులు కావడంతో ఎవరూ అతన్ని అడ్డుకోలేకపోయారు. ఇంత జరుగుతున్నా పక్కనే లేడిస్‌ కంపార్ట్‌మెంట్లో ఉన్న సెక్యురిటీ గార్ఢు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆగంతకుడు సదరు మహిళలను శారీరకంగా వేదిస్తున్న దురాగతాన్ని పాక్షిక అంధుడైన సహ ప్రయాణికుడు వీడియో తీశాడు. అదిప్పుడు దేశవ్యాప్తంగా  వైరల్‌ అవుతోంది.

ప్రమాదంలో పడేదే..!
ఆ కామాంధుడిని తీవ్రంగా ప్రతిఘటించే క్రమంలో ఆమె ఒక సందర్భంలో ట్రెయిన్‌ డోర్‌ దగ్గరకు వెళ్లింది. కొంచెమైతే ఆమె ప్రమాదానికి గురయ్యేదే. అయితే చాకచక్యంగా వ్యవహరించి ఆమె ధైర్యంగా అతనికి ఎదురు తిరగడంతో ప్రమాదం తప్పింది. తోటివారి సహాయంతో అతన్ని రైల్వే పోలీసులకు అప్పగించింది.

ఎంతచెప్పినా వినిపించుకోలేదు..
ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. ‘కుర్లాలో రైలు బయలుదేరగానే సదరు మహిళపై దుండగుడి దాడి మొదలైంది.  నేను అక్కడే లేడిస్‌ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న గార్డుకి ఎమర్జెన్సీ అలారం లాగమని చెప్పాను. కానీ అతడు పట్టించుకోలేదు. నాకు కళ్లు సరిగా కనిపించవు. నేను వాడిని అడ్డుకోవడానికిపోతే నా ప్రాణాలకు ప్రమాదం అని మిన్నకుండిపోయాను’ అని సమీర్‌ జావెరీ చెప్పాడు.

మరిన్ని వార్తలు