రూ. 5 కే 14 రకాల కూరగాయల విత్తనాలు

9 Nov, 2016 18:24 IST|Sakshi
రూ. 5 కే 14 రకాల కూరగాయల విత్తనాలు
ఏలూరు (మెట్రో)
జిల్లాలో ఇంటింటా కూరగాయలు పండించుకోవాలనే ఉద్దేశ్యంతో రూ. 5లకే 14 రకాల కూరగాయల విత్తనాలను సిద్ధం చేస్తున్నామని త్వరలోనే 5 లక్షల విత్తనాల కిట్‌లను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్‌కాటంనేని భాస్కర్‌ చెప్పారు. కలెక్టరేట్‌లో వెలుగు ఆధ్వర్యంలో తయారుచేస్తున్న కూరగాయల విత్తనాల నమూనా ప్యాకెట్‌లను కలెక్టరు పరిశీలించారు. సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయల విత్తనాలను ఇంటింటా పెంపకం ఒక అలవాటుగా మార్చడానికి కూరగాయల విత్తనాల పంపిణీ ఎంతో దోహదపడుతుందని కలెక్టరు చెప్పారు. బెండ, బీర, చిక్కుడు, కాకర, టమాట, ఆనబ, దోసకాయ, గోరుచిక్కుడు, వంకాయ, మెంతికూర, తోటకూర, పాలకూర, గోంగూర మొత్తం 14 రకాల విత్తనాలను ప్రత్యేక ప్యాకింగ్‌ద్వారా ప్రజలకు సబ్సిడీపై అందించడానికి తగు నిర్ణయం తీసుకున్నామన్నారు. కూరగాయల కిట్టుకు రూ. 12లు ఖర్చు అవుతుందని, రూ. 7లు సబ్సిడీ పోను ప్రతి ఇంట రూ. 5లకే 14 రకాల కూరగాయల విత్తనాలను అందించి ఇంటింటా కూరగాయల పంటను ప్రొత్సహిస్తామని చెప్పారు.తాజా కాయకూరలు  పెరట్లో పెంచుకునే పరిస్ధితిని కల్పిస్తామని, తాజా కాయగూరలు తినడం వల్ల ఆరోగ్యంగా జీవిం^è గలుగుతామని చెప్పారు. కార్యక్రమంలో ఏజేసీ ఎంహెచ్‌.షరీఫ్, వెలుగు ఏపీడీ రాజేశ్వరి, ఉద్యానవన శాఖ ఏడీలు దుర్గేష్, విజయలక్ష్మి పాల్గొన్నారు. 
 
 
 
మరిన్ని వార్తలు