కేటీపీఎస్‌లో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి బ్యాక్‌డౌన్‌

8 Aug, 2016 22:20 IST|Sakshi
కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం కర్మాగారం


పాల్వంచ రూరల్‌ :  వినియోగం తగ్గడంతో కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తి బ్యాగ్‌ డౌన్‌ కొనసాగుతోంది. కేటీపీఎస్‌ కాంప్లెక్స్‌లోని ఓఅండ్‌ఎంలో 720 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల 8 యూనిట్లు ఉన్నాయి. రోజూ 710 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. లోడ్‌ డిస్పాచ్‌ అథారిటీ అధికారుల ఆదేశాల మేరకు సోమవారం 200 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని బ్యాక్‌ డౌన్‌ చేసినట్లు సీఈ మంగేష్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం 510 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి గ్రిడ్‌కు అందుతోంది.  కేటీపీఎస్‌ 5వ దశ 10వ యూనిట్‌లో వార్షిక మరమ్మతుల నేపథ్యంలో ఈనెలాఖరు వరకు 250 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోతుందని సీఈ రత్నకుమార్‌ తెలిపారు. 9,11వ యూనిట్లలో 740 మెగావాట్ల విద్యుత్‌ జరుగుతుందని, తడిసిన బొగ్గు కారణంగా 10 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిందన్నారు.
 

మరిన్ని వార్తలు