36 ఏళ్లకు చిక్కిన లైంగికదాడి నిందితుడు!

6 Jul, 2016 03:26 IST|Sakshi
36 ఏళ్లకు చిక్కిన లైంగికదాడి నిందితుడు!

గంగాధర : లైంగిక దాడి కేసు నిందితుడు 36 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నందెలి తిరుపతిరావు 1980లో ఓ వివాహితపై లైంగికదాడి చేశా డు. అప్పుడతని వయస్సు 25 ఏళ్లు. బాధితురాలి ఫిర్యా దు మేరకు అప్పట్లో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు అరెస్టు చేస్తారని భయపడి నిందితుడు ఇంటినుంచి పారిపోయూడు.

ఒకటికాదు, రెండుకాదు.. ఏకంగా 36 ఏళ్లుగా ముంబైతోపాటు పలు ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ తప్పించుకున్నాడు. అరుునవాళ్లందరికీ దూరమై ఒంటరిగా బతకడం, వయోభారం మీదపడటంతో తన కుటుంబసభ్యులను కలుసుకోవాలపొ సోమవారం రాత్రి స్వగ్రామానికి వచ్చాడు. అరుుతే, 36 ఏళ్ల క్రితం జరిగిన లైంగికదాడి కేసులో తిరుపతిరావు నిందితుడని తెలుసుకున్న ప్రొబేషనరీ ఎస్సై రమేష్, కానిస్టేబుళ్లు కిరణ్, భూమేష్ గ్రామానికి వెళ్లి అతడిని అరెస్టు చేశారు.  అనంతరం  కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు పంపించారు.

మరిన్ని వార్తలు