సాదాసీదాగా మున్సిపల్‌ సమావేశం

24 Aug, 2016 00:15 IST|Sakshi
  1. 77 అంశాల ఎజెండా పాస్‌
  2. ఆదిలాబాద్‌ కల్చరల్‌ : ఆదిలాబాద్‌ మున్సిపల్‌ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. మెజార్టీ సభ్యులతో ఎజెండా ఆమోదం పొందింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రంగినేని మనీష అధ్యక్షత వహించగా, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఫరూక్‌ అహ్మద్, మున్సిపల్‌ కమిషనర్‌ అలువేలు మంగతాయారులు ఉన్నారు. సమావేశ ప్రారంభం కాగానే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రంగినేని మనీష మాట్లాడుతూ మున్సిపల్‌ వైస్‌చైర్మెన్‌ ఫరూక్‌ అహ్మద్‌ తల్లి నూర్‌జహన్‌బేగం మతికి, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రావు దేశ్‌పాండే మతి పట్ల సంతాపం ప్రకటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
         సమావేశ ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్‌ పార్టీ 12వ వార్డు కౌన్సిలర్‌ జహీర్‌ రంజానీ మాట్లాడుతూ అధికారులు తీరులో మార్పు రావాలన్నారు. అధికారులు కౌన్సిలర్ల ఫోన్‌లకు స్పందించడం లేదని, కొత్తగా కమిషనర్‌ , స్టాఫ్‌ సైతం రావడంతో అభివద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. చైర్‌పర్సన్‌ మనీష వెంటనే కమిషనర్‌కు 36 వార్డు సభ్యుల ఫోన్‌నంబర్‌లు ప్రతీ అధికారి వద్ద ఉండాలని, వారి ఫోన్‌లకు స్పందించాలని లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 
    ఉద్యోగుల శైలిలో మార్పు రావాలి...
    కొందరు అధికారులు శనివారం ఇండ్లలోకి వెళ్లి తిరిగి సోమవారం సాయంత్రం వరకు కూడా రావడం లేదని ఈ విధానం మారని పక్షంలో చర్యలు తప్పవని చైర్‌పర్సన్‌ హెచ్చరించారు. అవసరాలున్న సెక్షన్లలో సిబ్బందిని ఎక్కువగా నియమించాలన్నారు.  టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ బండారి సతీష్‌ మాట్లాడుతూ టీపీవో సెక్షన్‌లో పనులు జరగడం లేదని, అందరు కొత్త అధికారులు ఉండటంతో పనులు సక్రమంగా చేయడం లేదని , వెంటవెంటనే పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
        రాబోవు వినాయక చతుర్థిని పురస్కరించుకొని గుంతలు పూడ్చేందుకు  మొరం మట్టి ఎజెండా అంశాల్లో చేర్చడం హర్షించదగ్గ విషయమని , త్వరితగతిన మొరం తెప్పించాలని కోరారు. కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ అజయ్‌ మాట్లాడుతూ 37వ అంశంలో పరిశీలించాలని కోరగా మెజార్టీ సభ్యులు పాస్‌ అనడంతో ఆ అంశం చర్చకు రాలేదు. 24వ అంశంలో ఇంటిపన్ను వసూలు అడ్రస్సులు , కోర్టు కేసులు అంశాలతో కూడి ఉండటంతో వాయిదా వేసినట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనీశా ప్రకంటించారు. కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు అజయ్, జ్యోతి, సుష్మలు  37, 68 అంశాలను వ్యతిరేకిస్తూ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌కు డీసెంట్‌ నోటీసు అందజేశారు. 
     
     
మరిన్ని వార్తలు