మ‌హాప్ర‌సాదం

2 Jul, 2017 23:25 IST|Sakshi
మ‌హాప్ర‌సాదం
సత్తెన్న ప్రసాదానికి పెరిగిన డిమాండ్
‘లోవ ’ భక్తుల కొనుగోళ్లు
తొలిపాంచా, నమూనా ఆలయం కౌంటర్లలో 65 వేల ప్రసాదం ప్యాకెట్ల విక్రయం 
రూ.9.75 లక్షల ఆదాయం
అన్నవరం:  ఆషా«ఢమాసం.. ఆదివారం.. తుని రూరలె మండలంలోని  లోవ తలుపులమ్మతల్లి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వారి తిరుగుప్రయాణంలో భారీ ఎత్తున సత్యదేవుని ప్రసాదాలు కొనుగోలు చేశారు. కొండదిగువన తొలిపాంచా వద్ద, బైపాస్‌ రోడ్డులోని సత్యదేవుని నమూనా ఆలయం వద్ద గల ప్రసాదం విక్రయస్టాల్స్‌ వద్ద ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. రాత్రి ఏడు గంటల సమయానికి సుమారు 65 వేల ప్రసాదం ప్యాకెట్లు (125 గ్రాములు రూ.15) విక్రయించగా రూ.9.75 లక్షల ఆదాయం సమకూరింది. ఏటా    ఆషాఢమాసంలో వచ్చే ఆదివారాలలో భారీ సంఖ్యలో లోవ తలుపులమ్మ తల్లి దేవస్థానానికి వెళ్లే భక్తులు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని ప్రసాదం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొనే అన్నవరం దేవస్థానం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. కొండదిగువన తొలిపాంచా వద్ద, బైపాస్‌ రోడ్డులోని నమూనా ఆలయం వద్ద గల ప్రసాదం స్టాల్స్‌ వద్ద అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసింది. సుమారు 70  వేల ప్రసాదం ప్యాకెట్లను  సిద్ధం చేసింది. మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడుగంటల వరకూ సుమారు 65 వేల ప్యాకెట్లను విక్రయించినట్టు అధికారులు తెలిపారు.  మిగిలిన ఐదువేల  ప్రసాదం ప్యాకెట్లు కూడా రాత్రి  విక్రయించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దేవస్థానం ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు ఈ ప్రసాదం స్టాల్స్‌ను సందర్శించి అక్కడ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఏఈఓ సాయిబాబా, ఆలయ సూపరిండెంట్‌ బలువు సత్యశ్రీనివాస్, ఇనస్పెక్టర్‌ పోల్నాటి లక్ష్మీనారాయణ తదితరులు స్టాల్స్‌ వద్ద విక్రయాలు పర్యవేక్షించారు.
>
మరిన్ని వార్తలు