ఆటోమెషిన్‌ అవార్డుకు ఎంపికైన రఘువరన్‌

21 Aug, 2016 23:39 IST|Sakshi
రఘువరన్‌
పలాస : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కాశీబుగ్గ తిలక్‌నగర్‌కు చెందిన రత్నాల రఘువరన్‌ అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ ఆటోమెషిన్‌ అవార్డుకు ఎంపికైనట్లు తల్లిదండ్రులు రమణమూర్తి, తులసి ఆదివారం విలేకరులకు తెలిపారు. రఘువరన్‌ చెన్నైలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో బీటెక్‌ పూర్తి చేశాడు. అమెరికాలోని ఐఎస్‌ఏ ప్రతి ఏటా ఏడు రంగాల్లో ఏడుగురిని ప్రపం^è  వ్యాప్తంగా ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేస్తుందని, ఈ క్రమంలో వాటర్‌ ప్లాంటేషన్, బాటిల్స్, నేషనల్‌ కమ్యూనికేషన్‌ రంగాల్లో ఈ అవార్డుకు ఎంపికైనట్టు పేర్కొన్నారు.

ఐఎస్‌ఎ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల మంది సభ్యులు ఉండగా ఆ సభ్యులు ఆన్‌లైన్‌లో రఘువరన్‌ పంపిన పాయింట్‌కు ఎక్కువ శాతం మంది ఆమోదం తెలపడంతో అవార్డుకు ఎంపిక చేశారని తెలిపారు. ఈ అవార్డును వచ్చే సెప్టెంబరు 24న అమెరికాలో అందుకోనున్నట్లు తెలిపారు. కాశీబుగ్గ వాసికి అంతర్జాతీయ అవార్డు రావడం పట్ల పలువురు అభిమానులు అభినందనలు తెలిపారు.
 
మరిన్ని వార్తలు