చొక్కా కొంటే చిత్తు కాగితాలొచ్చాయి!

21 Jan, 2016 09:58 IST|Sakshi
చొక్కా కొంటే చిత్తు కాగితాలొచ్చాయి!

ఆన్‌లైన్ షాపింగ్‌తో మోసపోయిన బిహారీయుడు

లక్కవరపుకోట (విజయనగరం): ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసి.. ఆత్రంగా వచ్చిన పార్శిల్ తెరవగా అందులో చిత్తు కాగితాలు చూసి బిత్తరపోయిన యువకుడి ఉదంతమిది. విజయనగరం జిల్లాలో లక్కవరపుకోట మండలం శ్రీరాంపురం గ్రామం సమీపంలో గల స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా లిమిటెడ్ కర్మాగారం రోలింగ్ మిల్లులో పనిచేస్తున్న బిహార్ రాష్ట్రానికి చెందిన రాజుకుమార్‌సింగ్ ఈ నెల 9వ తేదీన సంశన్ టెలీషాపింగ్ సంస్థలో ఆన్‌లైన్ ద్వారా రూ.6,500 విలువైన టీషర్ట్, జీన్స్‌ప్యాంట్, సాంసంగ్ మొబైల్, కళ్లద్దాలు, బెల్టుకోసం ఆర్డర్ చేశారు.

15వ తేదీన లక్కవరపుకోట తపాలా హెడ్‌ఆఫీసుకు పార్శిల్‌ రాగా రూ.6,500 చెల్లించి తీసుకున్నారు. తీరా పార్శిల్ విప్పిచూడగా అందులో చెత్తపేపర్లు ఉండటంతో నిర్ఘాంతపోయాడు. లబోదిబో మంటూ పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీశాడు.
 

మరిన్ని వార్తలు