'సీరియస్ గా తీసుకుంటాం, ఎవరినీ వదలం'

15 Dec, 2015 15:27 IST|Sakshi
'సీరియస్ గా తీసుకుంటాం, ఎవరినీ వదలం'

విజయవాడ: 'కాల్ మనీ' సెక్సె రాకెట్ వ్యవహారంలో ఎవరినీ వదిలి పెట్టబోమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు అన్నారు. బెదిరింపులకు పాల్పడితే పీడీ యాక్టు కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రుణాలు చెల్లించకపోతే మహిళలను చెరబట్టడం దారుణమన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

'కాల్ మనీ'పై వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలిస్తామని, సీరియస్ గా తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల తనిఖీలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ వ్యవహారంలో బుద్ద నాగేశ్వరరావు, సముద్రాల నాగేశ్వరరావు, లంకలపల్లి సతీష్ లను అరెస్ట్ చేసి రూ. 7 లక్షల నగదు, ప్రామిసరీ నోట్లు, బైకులు స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ తెలిపారు.

'కాల్ మనీ' వ్యవహారం నేపథ్యంలోనే విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ సెలవుపై వెళ్లారని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఆయన నెలరోజుల క్రితమే సెలవుకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.

మరిన్ని వార్తలు