నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలి

18 Dec, 2016 03:49 IST|Sakshi

మార్కాపురం: పీఓఎస్‌ యంత్రాలు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఫజులుల్లా సూచించారు. పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం హోల్‌సేల్, రిటైల్‌ వ్యాపారులు, ట్రేడ్‌ లైసెన్స్‌దారులు, వర్తక సంఘాల సమాఖ్య, మెప్మా సిబ్బందికి నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ యంత్రాలను ఏర్పాటు చేసుకోవటం వలన కలిగే ఉపయోగాలు వివరించారు. పేటీఎం సిబ్బందిచే యంత్రాలు ఉపయోగించే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ డానియేల్‌ జోసఫ్, ఇన్‌చార్జ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నాయబ్‌ రసూల్, పాల్గొన్నారు.  

నగదు రహిత లావాదేవీలపై అవగాహన      
మండలంలోని చింతగుంట్ల గ్రామంలో శనివారం నాబార్డు ఆర్ధిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్‌ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు బ్యాంక్‌లు, ఏటీఎంల చుట్టూ తిరగకుండా మొబైల్‌ ఫోన్‌తో లావాదేవీలు నిర్వహించుకోవచ్చన్నారు. మొబైల్‌ వ్యాలెట్‌ గురించి ప్రొజెక్టర్‌ ద్వారా వివరించారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్‌ సిబ్బంది కాశయ్య ఉన్నారు. 

మరిన్ని వార్తలు