వణికిస్తున్న విష జ్వరం

19 Sep, 2016 00:06 IST|Sakshi
మదనపల్లె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

– పశ్చిమాన పెరుగుతున్న కేసులు
– నిద్దరోతున్న వైద్యశాఖ
– ‘పారిశుధ్యం’పై సమన్వయ లోపం
– మృత్యువాత పడుతున్న చిన్నారులు
ఓ పక్క ఎండలు అదరగొడుతుంటే.. మరోవైపు వదిలీ వదిలీ  పడుతున్న వర్షాలు ప్రజలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల జిల్లా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. దీంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. బాధితుల్లో పదేళ్లలోపు  పిల్లలే ఎక్కువమంది ఉండడం కలవరపాటుకు గురిచేస్తోంది.

‘‘ బి.కొత్తకోట బీరంగి పంచాయతీలో మూడేళ్ల వయస్సున్న అరుణ అనే చిన్నారి శనివారం జ్వరంతో మృతి చెందింది. డెంగీ జ్వరమే ఇందుకు కారణమని వైద్యులు నిర్ధారించారు.’’

‘‘ రామసముద్రం మండలంలోని మూగవాడి గొళ్లపల్లెకు చెందిన కార్తిక్‌ (16) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. శనివారం జ్వరం ఎక్కువకావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందాడు.’’

..ఈ రెండే కాదు పడమటి మండలాల్లో గత నెల రోజుల్లో 360 జ్వరా బాధిత కేసులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. విజృంభిస్తున్న విష జ్వరాలు ప్రజల్ని వణికిస్తున్నాయి.

చిత్తూరు (అర్బన్‌):
 వైద్యారోగ్యశాఖ, జిల్లా పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా విభాగాల మధ్య కొరవడిన సమన్వయం జనం ప్రాణాలపైకి తెస్తోంది. జ్వరాలపై గత ఏడాది జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మేల్కొనేలోపు చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
తగ్గడం లేదే..!
జిల్లాలో జూన్‌లో తేలికపాలి వర్షాలు పడ్డాయి. ఈనెలలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 985 జ్వరం కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 13 డెంగీ కేసులు ఉన్నాయి. జూలై నెలలో 759 కేసులు నమోదవగా 11 డెంగీ కేసులు, గత నెల 892 జ్వరం కేసుల్లో 8 డెంగీ కేసులు బయటపడ్డాయి. ఈనెల్లో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 489 మంది జ్వరాలతో ఆసుపత్రులకు వెళ్లినట్లు లెక్కలు చెబుతున్నాయి. రానున్న మాసాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. జ్వర బాధితుల సంఖ్య ఎక్కువయ్యే అవకాశం ఉందే తప్ప.. తగ్గేలా కనిపించడంలేదు.

ఈ ప్రాంతాల్లో ఎక్కువ
జ్వరాలతో బాధపడుతున్న వాళ్లు, మృత్యువాత పడుతున్న వాళ్లల్లో చాలామంది జిల్లాలోని పడమటి మండలాలకు చెందిన వాళ్లే కావడం ఆందోళన కలిగిస్తోంది. తూర్పు మండలాలతో పోలిస్తే పశ్చిమాన వాతావరణం కాస్త చల్లగా ఉండటానికి తోడు చిన్నపాటి వర్షాలు పడితే పరిసరాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. మురుగునీరు ప్రవహించడానికి సరైన కాలువ వ్యవస్థ లేకపోవడం, గ్రామాల్లో ఇళ్ల మధ్యే మురుగునీళ్లు నిలిచిపోతుండటం ఇందుకు ప్రధాన కారణం. ప్రధానంగా పలమనేరు, వి.కోట, పుంగనూరు, మదనపల్లె, మొలకలచెరువు, బి.కొత్తకోట, కుప్పం, గుడుపల్లె, శాంతిపురం ప్రాంతాల వైపు జ్వరాలతో బాధపడుతున్న వాళ్ల సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోంది.
సమన్వయం ఏదీ?
పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు సరిగా జరగడంలేదు. పారిశుధ్యం నిర్వహణ మొత్తం పంచాయతీ శాఖ చూస్తున్నా.. పనులు ఆశించిన స్థాయిలో ఉండటంలేదు. గతంలో ప్రతీ నెలా ఓ గ్రామంలో సామూహిక పారిశుధ్య పనులు నిర్వహిస్తుండటంతో పరిస్థితి కాస్త గాడిన పడేది. కానీ ఈ ఏడాది సీజనల్‌ జ్వరాలు వణికిస్తున్నా పంచాయతీశాఖను నిద్రలేపలేకపోతోంది. గ్రామాల్లో ఉన్న నీటి నిల్వ కేంద్రాలు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు దోమలకు పుట్టినిల్లుగా తయారైంది. నెలలో రెండు సార్లు వీటిని శుభ్రం చేయాలని నిబంధనలు చెబుతున్నా పట్టించుకునే దిక్కులేదు. జరగాల్సిన నష్టం జరిగిన తరువాత వైద్యారోగ్యశాఖ అధికారులు మేల్కొంటున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి ముందస్తుగా ప్రజల్ని చైతన్యం చేసి సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా కాపాడాల్సిందిపోయి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన జ్వరాలు విభృంభించిన తరువాత వైద్యశిబిరాలు పెట్టడం కంటితుడుపు చర్య తప్ప మరొకటి కాదనేది అందరికీ తెలిసిన సత్యం. పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య శాఖల మధ్య సమన్వయలోపం ప్రజలకు శాపంగా మారుతోంది.  సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల మధ్య భేదాభిప్రాయాల వల్ల పల్లెల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా తయారైంది.
గత పాఠాలు మరిచారా..?
రాష్ట్ర చరిత్రలోనే జిల్లాలో గతేడాది ఎక్కువ డెంగీ కేసులు నమోదయ్యాయి. 2012లో 329 డెంగీ కేసులు నమోదవడం ఓ సంచలనం.అయితే గత చరిత్రను తుడిచిపెడుతూ 2015లో ఏకంగా 1245 డెంగీ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. మూడేళ్ల కాలంలో ఈ సంఖ్య నాలుగంకెలకు చేరడం అధికారులకు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇక డెంగీ జ్వరాలతో గత ఏడాది జిల్లాలో చనిపోయిన వాళ్ల సంఖ్య 44. ఢిల్లీ నుంచి జాతీయ వైద్యృబందం రంగంలోకి దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి యువకులు,ృÐlద్దులు ఇలా చాలా మంది ప్రాణాలు గాల్లో కలిపిపోయాయి. విష జ్వరాలు సోకిన వాళ్లకు సకాలంలో డెంగీ, ఇతర పరీక్షలు చేయడంతో ఆలస్యం నెలకొనడం, కొన్ని చోట్ల సాధారణ జ్వరం గుర్తించడానికి అవలంభించే విధానాన్నే విష జ్వరాలను కనిపెట్టడంలో అన్వయించడం వల్ల చివర్లో ప్రాణాంతక జ్వరాలని గుర్తించడం వల్ల ప్రజలు తల్లడిల్లిపోయారు. దీనికి తోడు 135 మలేరియా కేసులు, 45 చికున్‌ గున్యా కేసులు సైతం నమోదయ్యాయి. గతం నేర్పిన పాఠాలనుృ§lష్టిలో ఉంచుకుని జాగ్రత్త పడాల్సిన యంత్రాంగం ఇంకా మొద్దునిద్దరలో ఉండటం శోచనీయమే.
నిధులు ఉపయెగించుకోండి...
  పారిశుద్ద్య పనులు మెరుగు పరచడానికి ఇప్పటికే 14వ ఆర్థిక సంఘ నిధులను అన్ని గ్రామాలకు పంపిణీ చేశాము. వీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోండి. కార్యదర్శులు, సర్పంచ్‌లు ఇందుకు చొరవ చూపాలి. ఇప్పటికే విష జ్వరాలపై మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించాం. విష జ్వరాలు, డెంగీ ప్రబలుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ద్య పనులు చేపడుతున్నాం. – కె.ల్‌.ప్రభాకరరావు, జిల్లా పంచాయతీ అధికారి.
నేటి నుంచి మొబైల్‌ క్లీనిక్స్‌...
సీజనల్‌ వ్యాధుల నుంచి ప్రజల్ని చైతన్యం చేసి అప్రమత్తం చేయడానికి నేటి నుంచే కొత్త ప్రణాళికను అమల్లోకి తెస్తున్నాం. మొబైల్‌ మలేరియా క్లీనిక్స్‌ పేరిట ఓ చైతన్య రథంలో మా సిబ్బంది ప్రతీ మునిసిపాలిటీ, కార్పొరేషన్లలో నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. దోమల వ్యాప్తి నివారణ, లార్వాల గుర్తింపు, డ్రైడే, పారిశుద్ద్య నిర్వహణ ఇలా అన్నింటిపై ప్రణాళిక రూపొందించాం. కచ్చితంగా గతేదికన్నా ఈ సారి జ్వరాల సంఖ్యను తగ్గిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఆయా వైద్యాధికారి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం. – డాక్టర్‌ జె.లావణ్య, జిల్లా మలేరియా అధికారి.

మరిన్ని వార్తలు