ప్రజా పంపిణీ 81.41 శాతం పూర్తి

16 Apr, 2017 00:21 IST|Sakshi

– 2,21,258 కార్డులకు నగదు రహితంపై సరుకులు
– అత్యధికంగా బేతంచెర్ల మండలంలో నగదురహిత లావాదేవీలు


కర్నూలు(అగ్రికల్చర్‌): ఏప్రిల్‌ నెలకు సంబంధించి ప్రజా పంపిణీ కార్యక్రమం శనివారం నాటితో ముగిసింది. 81.41 శాతం కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. జిల్లాలో 2,423 చౌకదుకాణాలు ఉండగా.. 11,90199 రేషన్‌ కార్డులు ఉన్నాయి. సాయంత్రం 7గంటల సమయానికి 9,36,419 కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. ఇందులో 2,21,258 కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్‌లో నగదు రహితంపై సరుకుల పంపిణీ గణనీయంగా పెరిగింది. బేతంచెర్ల మండలంలో అత్యధికంగా 60.86 శాతం కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. కోవెలకుంట్ల, సంజామల, పగిడ్యాల, ఓర్వకల్లు మండలాల్లో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. అతి తక్కువగా ఎమ్మిగనూరు మండలంలో 3.41శాతం కార్డులకు మాత్రమే నగదు రహిత లావాదేవీలు నిర్వహించారు. ఈ మండలంలో 45,603 రేషన్‌ కార్డులు ఉండగా 37,816 కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. ఇందులో 1,558 కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు.
 

మరిన్ని వార్తలు