పేదలకు ఆసరా.. సీఎం సహాయ నిధి

11 May, 2017 22:40 IST|Sakshi

అనంతపురం అర్బన్‌ : ప్రాణాంతక వ్యాధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న పేదలకు కోసం సీఎంఆర్‌ఎఫ్‌ (ముఖ్యమంత్రి సహాయ నిధి) ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుంది. వైద్య చికిత్స కోసం రూ.50 వేలు వరకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం భరిస్తుంది. అయితే చాలా మంది ఈ పథకం గురించి తెలియక దరఖాస్తు చేసుకోవడం లేదు. సమాజంలో అట్టడుగువర్గాలు, తెల్లకార్డుదారులు, దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న వారు ఈ పథకం ద్వారా లబ్ధిపొందేందుకు అర్హులు. మొత్తం 17 వ్యాధులకు ఈ పథకం కింద చికిత్స పొందొచ్చు.

ఏఏ వ్యాధులకు చికిత్స చేయించుకోవచ్చంటే.. :
1. కార్డిక్‌ వాల్వ్‌ రీప్లెస్‌మెంట్‌   2. కార్డిక్‌– సీఏబీసీ
3. కార్డిక్‌– ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ 4. మ్యో కార్డినల్‌ ఇన్‌ఫ్రాక్షన్‌ ఏంజియోప్లాస్టీ
5. కిడ్నీ ఫెయిల్యూర్‌ (మూత్ర పిండాలు పాడేతే) 6. బ్రెయిన్‌ స్ట్రోక్, ట్యూమర్, ఇతర బ్రెయిన్‌ వ్యాధులు
7. స్పైనల్‌ కార్డ్‌ (వెన్నుముక)కు సంబంధించి మేజర్‌ న్యూరోలాజికల్‌ కంప్లైంట్స్‌
8. కాన్సర్, కాన్సర్‌ కీమోథెరిపీ  9. మేజర్‌ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్స్‌
10. క్రానిక్‌ లివర్‌ (కాలేయ) జబ్బు  11. కిర్రోసిస్‌ ఆఫ్‌ లివర్‌
12. ఊపరితిత్తుల సర్జరీ, క్రానిక్‌ లంగ్‌ జబ్బు
13. పాన్‌క్రియాటిట్స్, కోలిసిస్ట్‌టిట్స్‌ (అబ్డామినల్‌ పెద్ద జబ్బులు)
14. మేజర్‌ అబ్డామినల్‌ సర్జరీ  15. ట్రాయుమా
16. బ్లాడర్, ప్రొస్టేట్, ముత్రపిండాల్లో రాళ్ల తొలగింపు వంటి మేజర్‌ యూరోలాజికల్‌ సర్జరీలు
17. హెమోడయాలసిస్‌

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే :
    + వ్యాధిగ్రస్తులు తమ దరఖాస్తులో పూర్తి వివరాలు పొందపర్చాలి. పూర్తీ పేరు, పెద్దల పేర్లు, వయస్సు, ఇంటి నంబరు, మొబైల్‌ నంబరు, వీధి పేరు, గ్రామం, మండలం, జిల్లా వివరాలు పొందుపరచాలి. ఏ వ్యాధికి ఆర్థిక సహాయం కోరతున్నారు అనేది తెలియజేయాలి.
    + దరఖాస్తును మండల తహసీల్దారు ద్వారా కలెక్టర్‌కు పంపుతారు. అర్హత ఉన్నట్లయితే సీఎంఆర్‌ఎఫ్‌ కింద ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి కలెక్టర్‌ సిఫారసు చేస్తారు. ప్రజాప్రతినిధుల ద్వారా అయినా ప్రభుత్వానికి పంపొచ్చు.వ్యాధిగ్రస్తులు నేరునైనా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపొచ్చు.
    + వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం అనుమతించిన తరువాత ఏడాదిలోపు చికిత్స చేయించుకోవాలి.అలా చేయించుకోకపోతే ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ల్యాప్స్‌ అవుతుంది.

మరిన్ని వార్తలు