కాలేజీ భవనంపై నుంచి దూకిన విద్యార్థిని

15 Mar, 2016 16:35 IST|Sakshi

కాలేజీ హాస్టల్ భవనంపై దూకడంతో విద్యార్థినికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిజామాబాద్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని దర్పల్లి మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన అలేఖ్య నిజామాబాద్ పట్టణంలోని ఎస్‌ఆర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్‌లోఉంటోంది.

మంగళవారం ఉదయం ఆమె హాస్టల్ భవనంపై నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు చికిత్సనందిస్తున్నారు. కాగా, హాస్టల్ భవనంలోని మెట్లపై నుంచి అలేఖ్య జారి పడిపోయిందని కళాశాలవారు విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థినే దూకినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఓ లెక్చరర్ వేధింపులు కారణమని కొందరు విద్యార్థులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు