వెండి తెరపై తరుణోదయం

31 Jul, 2016 00:44 IST|Sakshi
‘పెళ్లిచూపులు’ నటీనటులతో తరున్‌ భాస్కర్‌(పసుపుచొక్కా)
  • పెళ్లిచూపులు సినిమా దర్శకుడు మనోడే
  • యువతకు స్ఫూర్తినిస్తున్న దాస్యం తరుణ్‌భాస్కర్‌ 
  • తొలి చిత్రంతోనే విజయం నమోదు
  • సినిమా రూపంలో క్యాంపస్‌ అంపశయ్య నవల
  • నాలుగు భాషల్లో తాజాగా విడుదల
  • తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓరుగల్లు వెలుగులు మళ్లీ విరజిమ్ముతున్నాయి. వరంగల్‌ కళాకారుల చిత్రాలతో ఈ వారం బాక్సాఫీసు కళకళలాడుతోంది. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన దాస్యం తరుణ్‌భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన తొలిచిత్రం ‘పెళ్లిచూపులు’ రెండు తెలుగు రాష్ట్రాలు, యూఎస్‌లో పాజిటివ్‌ టాక్‌ సాధించింది. మరో వైపు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్‌ రచించిన ‘క్యాంపస్‌ అంపశయ్య’ నవలకు వెండితెర రూపం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల వ్యవధిలో విడుదలై ఈ రెండు చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
     
    సాక్షి, హన్మకొండ : జిల్లాకు చెందిన కళాకారులు రూపొందించిన చిత్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తున్నాయి. ఒకరు షార్ట్‌ఫిల్‌్మలతో వెండితెరకు పరిచయమై సినీ రంగంలో రాణిస్తుండగా.. మరొకరు ప్రముఖ నవలాకారుడిగా సాహితీ ప్రపంచంలో వెలుగొందుతున్నారు.
     
    వారిది భిన్నమైన మార్గం
    హన్మకొండ వడ్డేపల్లిలోని దాస్యం కుటుంబం ఏళ్ల తరబడి రాజకీయాల్లో కొనసాగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో
    దివంగత నాయకుడు దాస్యం ప్రణయ్‌భాస్కర్‌ యువజన క్రీడాశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆయన తమ్ముడు దాస్యం వినయ్‌భాస్కర్‌ వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎన్నికయ్యారు. అలాగే ఆయన మరో తమ్ముడు దాస్యం విజయ్‌భాస్కర్‌ ఇటీవల కార్పొరేటర్‌గా గెలుపొంది రాజకీయంగా ముందుగు సాగుతున్నారు. కాగా, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ సోదరుడు ఉదయ్‌భాస్కర్‌ కుమారుడు తరుణ్‌భాస్కర్‌ సినిమా రంగంలో సత్తాచాటుతున్నారు. అందుకు తగినట్లుగా సినిమా రంగానికి సంబంధించిన అంశాలపై మెలకువలను నేర్చుకుంటూ వచ్చారు.
     
    వయా షార్ట్‌ఫిల్‌్మ్స
    చిన్నతనం నుంచే తరుణ్‌భాస్కర్‌కి కళారంగంపై మక్కువ ఎక్కువ. పాఠశాల స్థాయిలోనే చిత్రలేఖనం, వ్యాసరచన, ఫొటోగ్రఫీ తదితర పోటీల్లో బహుమతులు సాధించారు. 2010లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించారు. అయితే సినిమా రంగం లో తన ప్రతిభను చాటేందుకు తరుణ్‌ భాస్కర్‌ షార్ట్‌ఫిల్‌్మ్స రూపకల్పనను వేదికగా చేసుకున్నారు. ఈ మేరకు వినూత్న గీత మీడి యా పేరుతో సొంతంగా ష్టార్ట్‌ఫిల్‌్మ్స తీయడం ప్రారంభించారు. 20–20 ఆఫ్‌ సినిమా, సైన్మా, అనుకోకుండా, తరుణ్‌ ఫ్రం తెలుగు మీడియం... వంటì  చిత్రాలను తీశారు. వీటికి యూట్యూబ్‌లో మంచి స్పందన లభించింది. అయితే తరుణ్‌భాస్కర్‌ రూ పొందించిన ‘అనుకోకుండా’ షార్ట్‌ఫిల్మ్‌ కేన్స్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్టివల్‌ షార్ట్‌లిస్టుకు ఎంపికైంది. దీంతో తరుణ్‌పై వెండితెర పెద్దలు ఆరా తీశారు.
     
    అనుకోకుండా.. పెళ్లి చూపులు
    తరుణ్‌ భాస్కర్‌ ప్రతిభను నలువైపులా చాటిన షార్ట్‌ఫిల్మ్‌ అనుకోకుండా..! ఇందులో మరో వారం రోజుల్లో పెళ్లి చూపులు ఉన్నాయనగా ఒక యువతికి ఒక యువకుడు పరిచయం కావడం... తర్వాత జరిగిన పరిణామాలు ఇతివృత్తం. అయితే ఈ షార్ట్‌ఫిల్‌్మనే సినిమాకు తగినట్లుగా కథను రూపొందించారు. తెలుగు చలనచిత్ర రంగంలో మూవీ మెఘల్‌గా పరిగణించే దగ్గుబాటి రామానాయుడు స్థాపించిన సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ కథతో తరుణభాస్కర్‌ దర్శకత్వంలో సినిమా తీసేందుకు ముందుకు వచ్చింది. ఎనిమిది నెలల క్రితం సినిమా షూటింగ్‌ మొదలైంది. ఈ క్రమంలో గత గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై తొలి రోజు నుంచే ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా సినీ విమర్శకులు సైతం తరుణ్‌భాస్కర్‌ దర్శకత్వం ప్రతిభపై ప్రశంసల జల్లు కురి పించారు. సున్నిత భావోద్వేగాలను, సహజంగా, హస్యంగా చిత్రీకరించిన తీరుపై మెచ్చుకున్నారు. తొలి సినిమా ఆర్థిక విజయం సాధించడంతో విక్టరీ వెంకటేశ్, మంచులక్ష్మీ వంటి ప్రముఖులు తరుణ్‌తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. 
     
మరిన్ని వార్తలు