ఎర్రచెరువులో మహిళ మృతదేహం

10 Sep, 2015 09:32 IST|Sakshi

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలోని ఎర్రచెరువులో గురువారం గుర్తు తెలియని శవాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎర్రచెరువు వద్దకు చేరుకుని మహిళ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళ వయస్సు 40 - 50 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు తెలిపారు. పోస్ట్మార్టం నిమిత్తం మహిళ మృతదేహన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్య లేక ఆత్మహత్య అనేది పోస్ట్మార్టం నివేదిక అందిన తర్వాతే తెలుస్తుందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు