నీరు ఉంటేనే అభివృద్ధి సాధ్యం

22 Mar, 2017 22:06 IST|Sakshi
నీరు ఉంటేనే అభివృద్ధి సాధ్యం
– ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ వెంకటరమణ
కర్నూలు(అర్బన్‌): ఎక్కడ నీరు పుష్కలంగా ఉంటుందో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రామీణ నీటి సరఫరా విభాగం కర్నూలు ఈఈ వెంకటరమణ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం జిల్లా పరిషత్‌లోని తన ఛాంబర్‌లో డివిజన్‌లోని డీఈఈ, ఏఈలతో నీటిని వృథా చేయరాదని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఈఈ వెంకటరమణ మాట్లాడుతూ గ్రామాల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఎక్కడైనా నీరు వృథా అవుతున్నట్లు సమాచారం వస్తే వెంటనే ఆర్‌డబ్ల్యూఎస్‌ సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు.
 
మానవాళి మనుగడకు నీరు ఎంతో అవసరమన్నారు. ప్రస్తుత వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు అవసరాల మేరకు రక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి విలువను ప్రజలకు తెలియజేసేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సమావేశంలో కర్నూలు, డోన్, నందికొట్కూరు డీఈఈలు మురళీధర్‌రావు, సురేష్‌బాబు, ఏడుకొండలు, క్వాలీటి కంట్రోల్‌ డీఈఈ రషీద్‌ఖాన్‌తో పాటు డివిజన్‌లోని ఏఈలందరు హాజరయ్యారు.
 
మరిన్ని వార్తలు