చెత్త నిండగానే జీహెచ్‌ఎంసీకి సమాచారం

10 Aug, 2016 22:14 IST|Sakshi
చెత్త నిండగానే జీహెచ్‌ఎంసీకి సమాచారం

బాలానగర్: బాలానగర్‌లోని కేంద్రీయ పరికరాల రూపకల్పన సంస్థ (సీఐటీడీ– సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌) ఆధ్వర్యంలో ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ సుజాయత్‌ ఖాన్, లెఫ్టినెంట్‌ కర్నల్‌ రవి చౌధురి, డైరెక్టర్‌ పవిత్ర కుమార్‌ ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్‌ జి. సనత్‌కుమార్‌ మార్గదర్శకత్వంలో ఓ నలుగురు శాస్త్రవేత్తలు ‘ఇంటెలిజెంట్‌ డస్ట్‌బిన్‌’ను రూపొందించారు. ప్రస్తుతం ఈ డస్ట్‌బిన్‌ను ట్రైల్‌ రన్‌లో ఉంచారు. ప్రస్తుతం పేపర్‌ వేస్టేజ్‌ ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో, కార్పొరేట్‌ ఆఫీసుల్లో పెట్టి పరిశీలిస్తున్నారు. 

ఆ డస్ట్‌బిన్‌లో వాటర్‌ బాటిల్స్, టీ కప్స్, వేస్ట్‌ పేపర్‌ అటువంటివి అయితే డస్ట్‌బిన్‌ నిండడానికి ఎక్కువ రోజులు పడుతుంది. అదే మన ఇంట్లో అయితే నలుగురు సభ్యులు ఉన్న వారికి మూడు రోజుల నుంచి అయిదు రోజుల్లో నిండిపోతుంది. నలుగురు డిజైన్‌ ఇంజినీర్లు పి.కె. విష్ణు, అనుపమ జాజు, సుందరగిరి శ్రీనివాస్, మదన్‌మోహన్‌ కులకర్ణి నెలరోజులు శ్రమించి ఈ ఇంటెలిజెంట్‌ డస్ట్‌బిన్‌ను తయారు చేశారు.

 

>
మరిన్ని వార్తలు